BigTV English

Excise raids pubs: హైదరాబాద్ పబ్ లపై అధికారుల ఆకస్మిక దాడులు..ఆరుగురికి పాజిటివ్

Excise raids pubs: హైదరాబాద్ పబ్ లపై అధికారుల ఆకస్మిక దాడులు..ఆరుగురికి పాజిటివ్

Crackdown on drug menace.. Excise Department raids pubs in Hyderabad: విశ్వనగరంగా ఖ్యాతిగాంచిన హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కల్చర్ రోజురోజుకూ పెరిగిపోతోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలని భావిస్తున్నారు. దీనితో పోలీసు శాఖకు విస్తృత అధికారాలు కూడా ఇచ్చారు. అయితే నగరం లోని ప్రముఖ పబ్బులలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ సేవించినవారిని పసిగట్టే ప్రత్యేక శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్స్ సహకారంతో ఈ తనిఖీలు నిర్వహించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. దాదాపు 25 పబ్బుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. పలువురు కస్టమర్లకు తనిఖీలు నిర్వహించారు. దీనితో శుక్రవారం అర్థరాత్రి పబ్బుల నిర్వాహకులు కంగారు పడ్డారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారనే సంగతి తెలిసి కొన్ని పబ్బులు కస్టమర్లను పంపిచేసి పబ్బులను మూసివేసి జాగ్రత్త పడ్డారు.


జాయింట్ ఆపరేసన్

గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో ఎక్సైజ్ శాఖ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఎన్ ఫోర్స్ మెంట్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కమలాసన్ రె్డి ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారుల బృందంతో కలిసి ఈ దాడులు నిర్వహించడం గమనార్హం. దాదాపు వందమందికి పైగా అనుమానితులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. వీరిని అత్యాధునిక డ్రగ్స్ డిటెక్షన్ కిట్ల సాయంతో పరీక్షలు నిర్వహించారు అధికరులు.శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి అర్థరాత్రి ఒంటి గంట దాకా తనిఖీలు జరుపుతూనే ఉన్నారు ఉన్నతాధికారులు. తొలుత ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. అలాగే రంగారెడ్డి జిల్లా పబ్బుల్లో నిర్వహించిన తనిఖీలో ముగ్గురుకి పాజిటివ్ గా వచ్చింది. దీనితో అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.


ఆరుగురికి పాజిటివ్

మొత్తంగా నమోదయిన 6 కేసులలో జోరా పబ్బులో ఒకరికి, క్లబ్ రోగ్ లో ఇంకొకరికి, జీ 40 పబ్ లో ఇద్దరికి విస్కీ సాంబ పబ్బులో మరో ఇద్దరికీ పాజిటివ్ వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ పై కఠినవైఖరి అనుసరించాల్సిందిగా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. నగరంలో ఎన్నిదాడులు జరుగుతున్నా డ్రగ్స్ సరఫరా ఆగడం లేదు. వాటి మూలాలను కనుక్కుంటేనే డ్రగ్స్ నిరోధించవచ్చని అంటున్నారంతా. డ్రగ్స్ వినియోగించినవారిని పట్టుకుని వారికి స్వల్ప శిక్షలతో సరిపుచ్చి లేదా కౌన్సిలింగ్ చేయడం ద్వారా డ్రగ్స్ ను అరికట్టడం సాధ్యం కాదని అంటున్నారు.

ఎయిర్ పోర్టులోనే అదుపుచేయాలి

విదేశాలనుంచి వస్తున్న డ్రగ్స్ ను ఎయిర్ పోర్ట్ లోనే అదుపులో చేయగలిగితే డ్రగ్స్ సరఫరాని నిలువరించినట్లవుతుందని అంటున్నారు పబ్లిక్. ఎక్కువగా నైజీరియా దేశం నుంచి భారత్ కు రహస్య మార్గాల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని..అలా డ్రగ్స్ సరఫరా చూస్తూ పట్టుబడ్డవారి పాస్ పోర్టులు రద్దు చేసి వారి దేశాలకు తిప్పి పంపించి అక్కడి పోలీసులతో మాట్లాడి వారికి అదే దేశంలో శిక్షలు పడేలా చేయాలని అందరు కోరుతున్నారు. గతంలోనూ పబ్బులపై చాలా దాడులే జరిగాయి. ఈ కేసుల్లో నిందితులు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు కావడంతో ఈజీగా కేసులనుంచి తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Related News

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Big Stories

×