BigTV English

Spicejet :స్పైస్ జెట్ సిబ్బందికి శాలరీ కట్ చేశారు .. 3 నెలలుఇంటికి పంపించారు

Spicejet :స్పైస్ జెట్ సిబ్బందికి శాలరీ కట్ చేశారు .. 3 నెలలుఇంటికి పంపించారు

Spicejet sends 150 cabin crew members on unpaid leave for 3 months: భారత విమానయాన సంస్థలలో స్పైస్ జెట్ ఒకటి. భారత అతి పెద్ద ఆరవ ఎయిర్ లైన్ గా ప్రయాణికులకు అతి తక్కువ ఖర్చుతో ప్రయాణ సేవలందిస్తున్న సంస్థ స్పైస్ జెట్.2005 నుండి సేవలందిస్తూ వస్తోంది. దేశ వ్యాప్తంగా వివిధ నగరాలకు నిత్యం రాకపోకలు సాగించే స్పైస్ జెట్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి ఉంది. గత ఆరేళ్లుగా నష్టాలను చవిచూస్తునే ఉంది. దానికి తోడు మధ్యలో కరోనా సంక్షోభంతో పీకల్లోతు కష్టాలలో ఇరుక్కుంది. ప్రస్తుతం రాకపోకలకు అన్ సీజన్ కావడంతో కొంతలో కొంత నష్టాల బారినుండి తప్పించుకోవాలని చూస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా 150 మంది క్యాబిన్ సిబ్బందిని మూడు నెలల పాటు తాత్కాలిక సెలవుపై పంపిస్తున్నామని సంస్థ ప్రకటించింది. అయితే సెలవులో ఉన్నా ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదంటోంది స్పైస్ జెట్ సంస్థ. వారిని ఉద్యోగులుగానే భావిస్తామని..అన్ని రకాల ప్రయోజనాలు ఇంతకు ముందులాగానే ఉంటాయని..మూడు నెలల తర్వాత తిరిగి వారి సేవలను ఉపయోగించుకుంటామని చెబుతోంది సంస్థ.


22 విమానాలతోనే సర్వీసు

ప్రస్తుతం 22 విమానాలతో మాత్రమే తన సర్వీసులను కొనసాగిస్తోంది స్పైస్ జెట్. కాగా హైదరాబాద్ నుండి అయోధ్యకు గత ఏప్రిల్ నుంచి స్పైస్ జెట్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేవలం రెండు గంటల వ్యవధిలో హైదరాబాద్ నుండి అయోధ్య కు చేరుకోవచ్చు. వీటి ఛార్జీలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండటం, వీటికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉండటంతో నాన్ స్టాప్ సర్వీసులు కూడా ప్రవేశపెట్టారు. అయితే సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సిబ్బందిని తాత్కాలికంగా మాత్రమే తొలగించామని సంస్థ అధికారులు చెబుతున్నారు.


Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×