E-Paper
Advertisement

LPG Gas Production: ఎల్‌పీజీ గ్యాస్ ఎలా తయారు చేస్తారు? ఏ ముడి పదార్థాలు అవసరం? ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి!

LPG Gas Production: ఎల్‌పీజీ గ్యాస్ ఎలా తయారు చేస్తారు? ఏ ముడి పదార్థాలు అవసరం? ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి!
Advertisement

LPG Gas Production: దేశంలో గ్యాస్ కష్టాలు మెుదలైనట్లు కనిపిస్తోంది. ఎల్‌పీజీ గ్యాస్ కమర్షియల్ సిలిండర్లపై ఆంక్షలు, డొమెస్టిక్ సిలిండర్ల కొరత.. ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం ఎల్‌పీజీ గ్యాస్ అంశం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఎల్‌పీజీ గ్యాస్ ను ఎలా తయారు చేస్తారు? దేశంలో దీని ఉత్పత్తి ఎలా జరుగుతుంది? దీనిలోని ముడి పదార్థాలు ఏవి? ఎల్‌పీజీని అత్యధికంగా తయారు చేసే దేశం ఏది? వంటి అంశాలను ఈ కథనంలో పరిశీలిద్దాం.

ఎల్‌పీజీ గ్యాస్ ఎలా తయారవుతుంది?

ఎల్‌పీజీ అనేది సహజంగా లభించే వాయువు కాదు. దీనిని ప్రధానంగా రెండు మార్గాల్లో వెలికి తీస్తారు. ఇందులో ఒకటి చమురు శుద్ధి కాగా, మరొకటి సహజ వాయువు వెలికితీత. చమురుశుద్ధి విషయానికి వస్తే.. భూమి నుండి తీసిన ముడి చమురును (Crude Oil) రిఫైనరీలలో వేడి చేసినప్పుడు వివిధ ఉష్ణోగ్రతల వద్ద పెట్రోల్, డీజిల్ వంటివి విడిపోతాయి. ఆ ప్రక్రియలోనే ఎల్‌పీజీ గ్యాస్ కూడా విడుదలవుతుంది. మరో పద్దతిలో భూగర్భం నుండి సహజ వాయువును తీసేటప్పుడు అందులో మిశ్రమంగా ఉన్న ప్రొపేన్, బ్యూటేన్‌లను వేరు చేసి ఎల్‌పీజీగా మారుస్తారు.

దేశంలో ఎల్‌పీజీ ఉత్పత్తి?

Advertisement

భారతదేశంలో ఎల్‌పీజీ తయారీ ప్రధానంగా పెట్రోలియం రిఫైనరీల ద్వారా జరుగుతోంది. రిలయన్స్ (Jamnagar), ఇండియన్ ఆయిల్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL) వంటి సంస్థలు తమ రిఫైనరీలలో ముడి చమురును శుద్ధి చేసే క్రమంలో ఎల్‌పీజీని ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే భారతదేశం తన అవసరాలకు సరిపడా ఎల్‌పీజీని సొంతంగా తయారు చేసుకునే స్థితిలో లేదు. అందుకే దాదాపు 50% కంటే ఎక్కువ ఎల్‌పీజీని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది.

ఎల్‌పీజీ ముడి పదార్థాలు

ఎల్‌పీజీ అనేది ప్రధానంగా ప్రొపేన్, బ్యూటేన్ పదార్థాల మిశ్రమం. ప్రొపేన్ త్వరగా మండే గుణాన్ని కలిగి ఉంటే.. బ్యూటేన్ అధిక వేడిని కలుగుజేస్తుంది. ఎల్‌పీజీ తయారీకి.. ముడి చమురు లేదా సహజవాయువు మాత్రమే ప్రధాన మూలాధారాలుగా ఉన్నాయి. అయితే సాధారణంగా గ్యాస్ లీక్ అయినప్పుడు ఒక రకమైన వాసనను ప్రతీ ఒక్కరూ పీల్చే ఉంటారు. దానిని ఇథైల్ మెర్కాప్టన్ (Ethyl Mercaptan) అంటారు. ఇది సహజసిద్ధంగా ఎల్ పీజీ గ్యాస్ లో ఉండదు. గ్యాస్ లీక్ అయినప్పుడు వాసన కోసం ఈ రసాయనాన్ని ప్రత్యేకంగా కలుపుతారు. వాస్తవానికి ఎల్‌పీజీకి ఎలాంటి వాసన ఉండదు.

Advertisement

Also Read: AP Weather: ఎండల వేళ.. చలచల్లని శుభవార్త.. 5 రోజులు వర్షాలే వర్షాలు!

అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం

ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా (USA) ఎల్‌పీజీని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశంగా ఉంది. షేల్ గ్యాస్ (Shale Gas) విప్లవం తర్వాత అమెరికా ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఆ తర్వాత స్థానాల్లో సౌదీ అరేబియా, చైనాలు ఉన్నాయి. అయితే భారత్ తన ఎల్పీజీ (LPG) అవసరాల్లో సుమారు 60 శాతం కంటే ఎక్కువ భాగాన్ని ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ వంటి గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం ఆ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో గ్యాస్ సరఫరాకు అంతరాయం జరిగి భారత్ లో గ్యాస్ కొరత ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో అక్కడి నుంచి భారత్ కు రావాల్సిన ముడిచమురుపై తీవ్రంగా ప్రభావం పడుతోంది. దీంతో దేశీయంగా ఎల్ పీజీ చమురు తయారీపై ప్రతికూల ప్రభావం పడి.. దేశంలో అనూహ్యంగా గ్యాస్ కొరత ఏర్పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Gas cylinder shortage: గ్యాస్ కష్టాలపై రేవంత్ సర్కార్ ఫోకస్.. ఉత్తమ్ కుమార్ హైలెవెల్ మీటింగ్

Related News

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

Big Stories

Advertisement
×