E-Paper
Advertisement

Royal Enfield Electric Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ బైక్, త్వరలో దేశీ మార్కెట్ లోకి ఎంట్రీ!

Royal Enfield  Electric Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ బైక్, త్వరలో దేశీ మార్కెట్ లోకి ఎంట్రీ!
Advertisement

 Royal Enfield Flying Flea C6 Electric Bike: ప్రముఖ టూ వీలర్ తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలో ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. తన తొలి ప్రొడక్షన్ ఎలక్ట్రిక్ బైక్‌ గా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6ను మార్కెట్ కు పరిచయం చేయనుంది. ఈ క్రేజీ బైక్ 2026 మిడ్ ఇయర్ లో మార్కెట్ లోకి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఫ్లయింగ్ ఫ్లీ గురించి..

ఫ్లయింగ్ ఫ్లీ  అనేది రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలో క్రేజీ గుర్తింపును కలిగి ఉంది. ఈ బైక్ ను రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కంపెనీ రూపొందించిన తేలికైన మోటార్‌ సైకిల్‌ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సమయంలో ఈ బైక్‌ ను పారాట్రూపర్లు గాలిలో నుంచి కిందికి జారేలా రూపొందించడంతో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు అదే వారసత్వాన్ని ఆధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీతో జత చేసి మళ్లీ జీవం పోసేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రయత్నిస్తోంది.

చెన్నైలో కనిపించిన టెస్ట్ మోడల్స్

Advertisement

రీసెంట్ గా చెన్నై  పరిసరాల్లో ఫ్లయింగ్ ఫ్లీ ఎలక్ట్రిక్  బైక్‌ కు సంబంధించిన టెస్ట్ మోడల్స్ కనిపించాయి. ముందుగా కనిపించిన ప్రోటోటైప్‌ ల మాదిరిగానే కనిపిస్తున్నాయి. ఈ బైక్ ప్రస్తుతం ప్రొడక్షన్ దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.  ఈ మోడల్‌ ను తొలిసారి  2024లో ఇటలీలో జరిగిన EICMA మోటార్‌ సైకిల్ షోలో ప్రదర్శించారు. ఆ సమయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఫ్యూచర్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి సంబంధించి టీజ్ చేసింది. అభివృద్ధి దశలో భాగంగా లడఖ్ లోని కఠినమైన పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించింది.

రెట్రో స్టైల్ కొనసాగింపు..

ఈ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ విషయానికి వస్తే,  రాయల్ ఎన్‌ఫీల్డ్‌ కు ప్రసిద్ధి చెందిన రెట్రో స్టైల్ కొనసాగుతుంది. రౌండ్ LED హెడ్‌ ల్యాంప్, గిర్డర్ స్టైల్ ఫ్రంట్ సస్పెన్షన్, మినిమలిస్ట్ బాడీ డిజైన్ మెయిన్ ఆకర్షణలుగా ఉంటాయి. బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ ఉండటం వల్ల సంప్రదాయ చైన్ డ్రైవ్ బైక్‌ లతో పోలిస్తే శ్శబ్దంగా, స్మూత్‌ గా నడుస్తుందని తెలుస్తోంది.

Advertisement

Read Also: KTM బైక్ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్, ఇక డబుల్ వారెంటీ!

ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ పూర్తిగా కొత్త ఎలక్ట్రిక్ ప్లాట్‌ ఫామ్‌పై రూపొందించబడింది. భవిష్యత్‌లో వచ్చే ఇతర ఎలక్ట్రిక్ మోడళ్లకు కూడా ఇదే ప్లాట్‌ఫామ్ ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర విషయానికి వస్తే,  రాయల్ ఎన్‌ఫీల్డ్ 450cc,  650cc బైక్‌ల మధ్య స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఫ్లయింగ్ ఫ్లీ C6 రాయల్ ఎన్‌ఫీల్డ్‌ కు మాత్రమే కాకుండా భారత ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్‌ లో ఓ కీలక మైల్ స్టోన్ గా నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: కవాసకి క్రేజీ ఆఫర్, ఆ బైక్ మీద ఏకంగా రూ. 22,000 తగ్గింపు!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×