E-Paper
Advertisement

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?
Advertisement

Poverty Eradication: మనం హ్యాపీగా బతుకుతున్నాం కదా అని చుట్టూ ఉన్న వాళ్ళందరి పరిస్థితులు అలాగే ఉంటాయని అనుకోలేం. పూటకూటి కోసం నిత్యం పోరాడే ఎంతోమంది జీవితాలు ఇప్పటికీ చీకట్లోనే మగ్గుతున్నాయి. ప్రపంచాన్ని పీడిస్తున్న ఈ పేదరికం భూతాన్ని తరిమికొట్టేందుకే ప్రతీ సంవత్సరం అక్టోబర్ 17 వ తేదీని ప్రత్యేకంగా కేటాయించారు.

1987 అక్టోబర్ 17న..

అసలు ఈ రోజు వెనక పెద్ద హిస్టరీనే ఉంది. సరిగ్గా 1987 అక్టోబర్ 17న ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో లక్షలాది మంది జనం రోడ్డెక్కారు. ఆకలి కేకలతో అలమటిస్తున్న పేదవాళ్ళ గోడును ప్రపంచానికి గట్టిగా వినిపించారు. ఆ పోరాటానికి దక్కిన గుర్తింపే ఇది. సరిగ్గా ఐదేళ్ల తర్వాత, అంటే 1992లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ దీన్ని అధికారిక అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతీ ఏటా ఈ రోజున పేదరికం మీద పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఎలా కాపాడుకోవాలి?

Advertisement

కేవలం ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని కూర్చోవడం కాదు.. పేదరికంలో మగ్గుతున్న వాళ్ళు అసలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? వాళ్ళ హక్కులను ఎలా కాపాడుకోవాలి? అనే దానిపై సమాజంలో అందరికీ అవగాహన కల్పించడమే ఈ డే మెయిన్ ఉద్దేశం. ఇక రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మారాలని, ఐక్యరాజ్యసమితి 2030 ఎజెండాలో భాగంగా ఓ పెద్ద టార్గెట్ పెట్టుకుంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఏ రూపంలో ఉన్న పేదరికమైనా సరే పూర్తిగా అంతం చేయాలనేదే లక్ష్యం. కేవలం మాటలతో కాకుండా, ఆచరణలో పేదరికాన్ని తరిమికొట్టిననాడే అందరికీ సమానమైన బతుకులు దక్కుతాయి.

Also read: బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

Tags

Related News

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కే ‘తిరంగా యాత్ర’ అడ్డుకున్న పోలీసులు.. ఇంటికెళ్లి నోటీసులు అందజేత!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో

నా ఇంటి చుట్టూ నిఘా పెట్టారు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?

Big Stories

Advertisement
×