E-Paper
Advertisement

Israel – Gaza Conflict :పాలస్తీనా జెండాతో ఇజ్రాయెల్ సైన్యం ముందుకు బాలుడు.. ఆ తర్వాత ?

Israel – Gaza Conflict :పాలస్తీనా జెండాతో ఇజ్రాయెల్ సైన్యం ముందుకు బాలుడు.. ఆ తర్వాత ?
Advertisement

Israel – Gaza Conflict : ఇజ్రాయెల్ లో ప్రస్తుతం క్లిష్టపరిస్థితులు నెలకొన్నాయి. గాజా పై హమాస్ వరుస దాడుల తర్వాత.. ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్విట్టర్ ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో పాలస్తీనా పౌరుడు హమాస్ కోసం ఇజ్రాయెల్ సైన్యం ముందు తన సొంత కొడుకును కవచంగా ఉపయోగించుకున్నాడు. కొడుకు చేతిలో జెండా పెట్టి.. వారి వద్దకు వెళ్లు అని సైన్యం సభ్యుల ముందుకి పంపాడు.

వాళ్లను చూసి భయపడకు. దగ్గరగా వెళ్లి వారిపై కాల్పులు జరిపి చంపేయ్ అంటూ బిగ్గరగా అరిచాడు. సైన్యం ముందుకెళ్లి నిలబడు.. వాళ్లని కాల్చనివ్వు.. మన జెండాను ఎత్తి చూపిస్తే వారు నిన్నేమీ చేయరు.. తన కొడుకును రెచ్చగొట్టాడు. తండ్రి చెప్పిన మాటలు విని నిజంగానే వారి వద్దకు వెళ్లాడు ఆ పిల్లాడు. చిన్నపిల్లాడిపై చర్యలు తీసుకోవడం తప్పు. తమ వద్దకువచ్చిన పిల్లాడితో సైన్యంలో ఒకరు మాట్లాడుతుండగా.. వారిపై రాళ్లు విసురు అంటూ మళ్లీ హమాస్ సపోర్టర్ బిగ్గరగా అరిచాడు. నిజందానే రాళ్లను తీసి సైన్యంపై విసిరాడు ఆ పిల్లాడు. పాపం.. ఆ పిల్లాడికి యుద్ధం అంటే ఏంటో కూడా తెలియని వయసు. బహుశా 2-3 సంవత్సరాల వయసు ఉంటుందేమో. ఆ వయసు నుంచే సైన్యంపై దాడి చేయాలని ఆ తండ్రి చెప్పడం గమనార్హం. సైన్యం నుంచి తన ప్రాణాలను కాపాడుకునేందుకు పిల్లాడిని అడ్డుపెట్టుకున్న ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది నమ్మశక్యంగా లేదని, ఇజ్రాయెల్ లో పరిస్థితి ఎలా ఉందో చెప్పేందుకు ఈ వీడియోనే నిదర్శనమని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

Big Stories

Advertisement
×