E-Paper
Advertisement

Leo Movie Update : సక్సెస్ కోసం ఒంటరి పోరాటానికి కూడా సై.. అంటున్న ఇళయ దళపతి

Leo Movie Update : సక్సెస్ కోసం ఒంటరి పోరాటానికి కూడా సై.. అంటున్న ఇళయ దళపతి
Advertisement
Thalapathy Vijay

Leo Movie Update : ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఇళయ దళపతి విజయ్ చేస్తున్న లేటెస్ట్ సంచలన చిత్రం లియో. ఈ మూవీ లో స్టార్ హీరోయిన్స్ త్రిషా విజయ్ సరసన నటిస్తుంది. విజయ్ పేరుకే కోలీవుడ్ యాక్టర్ కానీ ఇతను టాలీవుడ్ ప్రేక్షకులకు తన డబ్బింగ్ మూవీస్ ద్వారా బాగా పాపులర్. విజయ్ తమిళ్ లో చేసిన చాలా మూవీస్ తెలుగు నుంచి రీమేక్ చేయబడినవి కావడం విశేషం. మరీ ముఖ్యంగా తెలుగు లో సూపర్ హిట్ గా నిలిచిన 

ఒక్కడు,పోకిరి లాంటి మూవీస్ తమిళ్ లో రీమేక్ చేసి ఇతను మంచి పేరుని సంపాదించుకున్నాడు.

Advertisement

ప్రస్తుతం లోకేష్ కనకరాజు , విజయ్ కాంబినేషన్లో వస్తున్న లియో చిత్రం ట్రైలర్ మంచి క్రేజీ బజ్ క్రియేట్ చేసింది. ఈ ట్రైలర్లో అబ్సర్వ్ చేసినట్లయితే సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ సీన్స్ ని ఇందులో ప్యాక్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ముఖ్యంగా ఒక వంద మందితో కలిసి హీరో చేసే ఫైట్ ఉండబోతోంది అని ఈ ట్రైలర్ లో సూచనప్రాయంగా తెలుస్తుంది. మరొక విషయం ఏమిటంటే ఈ షాట్స్ ఎక్సలెంట్ గా రావడం ఏ కాకుండా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో విజయ్ ఎటువంటి డూప్ లేకుండా స్వయంగా చేశారట.

ఈ విషయాన్ని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మూవీ డైరెక్టర్ లోకేష్ కనకరాజు స్వయంగా వెల్లడించారు.

Advertisement

దీంతో లియో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి అని చెప్పొచ్చు. పైగా హీరో 100 మందితో చేసే ఈ రియల్ ఫైట్ మూవీకి హైలెట్గా నిలిచే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఫైట్ ఎవరు ఊహించని విధంగా ఉంటుందని…ఈ సినిమాలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయను ఒక ట్విస్ట్ కూడా ఉందని కూడా టాక్. రీసెంట్గా విజయ్ స్ట్రైట్ తెలుగు మూవీ వారసుడు తర్వాత అతను తెలుగు మార్కెట్ పైన కూడా కన్ను వేసినట్లు తెలుస్తుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన వారసుడు తెలుగులో ఫ్లాప్ అవడంతో ఈసారి సక్సెస్ సాధించాలి అని విజయ్ మంచి పట్టుదల మీద ఉన్నాడు.

ఇప్పటివరకు ఎన్నో తెలుగు డబ్ మూవీస్ తో ప్రేక్షకులకు బాగా దగ్గర అయినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు.కానీ ఈ సారి లియో తో ఆలోటు తీర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న తమిళ్ స్టార్ హీరోలు అందరిలో తెలుగులో విపరీతమైన అభిమానం ఉన్న ఒకే ఒక హీరో రజనీకాంత్ అనడంలో నో డౌట్. మరి విజయ్ ఏకంగా రజనీకాంత్ రేంజ్ స్టార్ డమ్ టాలీవుడ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే విజయ్ భావిస్తున్నట్టు లియో చిత్రం తెలుగులో మంచి సక్సెస్ సాధిస్తే ఇక అతనికి తెలుగు మార్కెట్లో కూడా గిరాకీ పెరిగి పోతుంది. అందుకే విజయ్ ఎంతో జాగ్రత్తగా దగ్గరుండి ఈ మూవీ కు సంబంధించిన చాలా విషయాలు పర్యవేక్షించడం జరుగుతోంది.

అందుకే తెలుగు మార్కెట్ నాడి బాగా తెలిసిన లోకేష్ కనకరాజ్ ను ఈ మూవీ డైరెక్టర్ గా ఎంచుకున్నారు. అందుకే రియల్ ఎస్టేట్ ఇంప్రెషన్ తెచ్చుకోవడం కోసం, అందరు చెప్పిన వినకుండా ..రిస్క్ అయినా సరే వందమందితో ఒంటి చేత్తో పోరాడడానికి విజయ్ రెడీ అయ్యాడు. విజయ్ డెడికేషన్ నిజంగా అభినందించదగ్గ విషయం.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×