E-Paper
Advertisement

Investment : పరిశోధనకు నిధుల ప్రవాహం

Investment : పరిశోధనకు నిధుల ప్రవాహం
Advertisement

Investment: ఆవిష్కరణలు, పరిశోధనపై నిరుడు దాదాపు 222 బిలియన్ డాలర్లు వెచ్చించారు. మార్కెట్ కేపిటలైజేషన్‌ అత్యధికంగా ఉండి నాస్‌డాక్‌లో లిస్టయిన టాప్ టెన్ కంపెనీలు ఉమ్మడిగా చేసిన వ్యయం ఇది. గత దశాబ్దకాలంలో రీసెర్చ్-డెవలప్‌మెంట్‌పై యాపిల్ వెచ్చించిన మొత్తం 3 బిలియన్ డాలర్ల నుంచి 26 బిలియన్ డాలర్లకు చేరింది.

2022లో 27.7 బిలియన్ డాలర్లు ఖర్చు చేసిందా టెక్ దిగ్గజం. పరిశోధనపై అమెజాన్ అత్యధికంగా నిధులు వెచ్చించింది. ఆ సంస్థ నిరుడు 73.2 బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టింది. మెటా, యాపిల్ వెచ్చించిన మొత్తం కన్నా ఇది రెట్టింపు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ 39.5 బిలియన్ డాలర్లు, ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా 35.3 బిలియన్ డాలర్లు ఆర్ అండ్ డీ పై వెచ్చించాయి.

Advertisement

అలాగే మైక్రోసాఫ్ట్ 26.6 బిలియన్ డాలర్లు, చిప్ తయారీ సంస్థ ఎన్విడియా 7.3 , బ్రాడ్ కామ్ 4.9, ఏఎస్ఎంఎల్ 3.3, టెస్లా 3.1 బిలియన్ డాలర్లు వెచ్చించాయి. 2022లో తమ స్టాక్ ధరలు తగ్గినప్పటికీ ప్రధాన టెక్ కంపెనీలు ఆర్ అండ్ డీ‌పై భారీ మొత్తంలో నిధులు వెచ్చించడం విశేషం. ఇందుకోసం టెక్ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.

2023లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ సంయుక్తంగా 40 వేల మందిపై వేటు వేశాయి. తద్వారా ఆదా చేసిన మొత్తాన్ని పరిశోధనకు మళ్లించినట్టు విదితమవుతోంది. 2000-20 మధ్య ప్రపంచవ్యాప్తంగా ఆర్ అండ్ డీ వ్యయం మూడు రెట్లు పెరిగింది. ఇది దాదాపు 2.4 ట్రిలియన్ డాలర్లు.

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×