E-Paper
Advertisement

కర్ణాటకలో ఘోరం.. పట్టపగలే యువతిని కొడవలితో నరికి చంపిన యువకుడు.. ఇదిగో వీడియో!

కర్ణాటకలో ఘోరం.. పట్టపగలే యువతిని కొడవలితో నరికి చంపిన యువకుడు.. ఇదిగో వీడియో!
Advertisement

Karnataka Crime: కోడిని కోసినంత ఈజీగా.. మేకను నరికినంత నార్మల్‌గా.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు! వీడిని కిరాతకుడు అనాలా..? ఉన్మాది అనాలా..? లేక నరరూప రాక్షసుడు అనాలా..? వీడికి చట్టం అంటే భయం లేదు.. జైలుకెళ్తానన్న బాధ లేదు.. ఉరితీస్తారేమో అన్న వణుకూ లేదు! కొడవలి పట్టుకుని నడి బస్టాండ్‌లో ఊచకోత కోశాడు. అసలేం జరిగిందంటే?

వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బి.సి. రోడ్డు KSRTC బస్టాండ్ జూలై 16 సాయంత్రం వేళ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఎవరి ప్రయాణాల్లో వారు బిజీగా ఉన్న సమయంలో, ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది. కళ్ల ముందే ఒక ఉన్మాది కొడవలి పట్టుకుని ఓ యువతిని నరికి చంపాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ఆ యువతి ప్రాణాలు కోల్పోయే వరకు అక్కడే నిలబడి చూసి, ఆ తర్వాత రక్తం ఓడుతున్న కత్తితో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘోరాన్ని కళ్లారా చూసిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు.

Advertisement

బాధితురాలి నేపథ్యం.. సేవ చేసే చేతులే కనుమూశాయి
ఈ క్రూర దాడిలో ప్రాణాలు కోల్పోయిన యువతిని లావణ్యగా గుర్తించారు. ఆమె కల్లాడ్కలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ రోగులకు సేవలందిస్తోంది. ఎప్పటిలాగే తన డ్యూటీ ముగించుకుని, ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కాలని బి.సి. రోడ్డు బస్టాండ్‌కు చేరుకుంది. కొద్దిసేపట్లో ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో గడపాల్సిన ఆ యువతి.. అంతలోనే మృత్యురూపంలో పొంచి ఉన్న ఉన్మాది చేతిలో బలవుతుందని ఎవరూ ఊహించలేదు. సమాజానికి సేవ చేసే ఒక మంచి మనసున్న నర్సు జీవితం ఇలా నడిరోడ్డుపై అర్థాంతరంగా ముగిసిపోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

వన్ సైడ్ లవ్ ఉన్మాదం..
ఈ ఘోరానికి ఒడిగట్టిన హంతకుడిని బెల్తంగడి తాలూకా ఓడిల్నాలకు చెందిన చేతన్‌గా పోలీసులు గుర్తించారు. లావణ్యకు ఈ చేతన్ దూరపు బంధువు కూడా అవుతాడు. కొంతకాలంగా ప్రేమ పేరుతో ఆమె వెంటపడుతూ వేధించడం మొదలుపెట్టాడు. అయితే లావణ్య అతడి ప్రవర్తన నచ్చక, ఆ ఏకపక్ష ప్రేమను సున్నితంగా తిరస్కరించింది. తన ప్రేమను కాదంటుందా అనే అహంకారం, కక్ష ఆమెపై పగ పెంచుకునేలా చేశాయి. ఎలాగైనా ఆమెను అంతమొందించాలనే క్రూరమైన ఆలోచనతోనే నిందితుడు పక్కా ప్లాన్‌తో బస్టాండ్‌లో ఒంటరిగా దొరికిన అదును చూసి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

Advertisement

హంతకుడి కోసం పోలీసుల వేట
ఈ దారుణ హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న హంతకుడు చేతన్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించి తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు, వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చట్టం అంటే భయం, జైలు శిక్ష పడుతుందనే వణుకు లేకుండా ఇంతటి క్రూరత్వానికి పాల్పడిన ఇలాంటి ఉన్మాదిని నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదంటూ ప్రజలు, మహిళా సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

Also Read: మనుషులు లేరు.. కేవలం బొమ్మలు మాత్రమే బతికే వింత ఊరు.. ఎక్కడుందో తెలుసా?

Related News

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కే ‘తిరంగా యాత్ర’ అడ్డుకున్న పోలీసులు.. ఇంటికెళ్లి నోటీసులు అందజేత!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో

నా ఇంటి చుట్టూ నిఘా పెట్టారు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?

Big Stories

Advertisement
×