E-Paper
Advertisement

ఈయనకు ఏమైనా పిచ్చా? ఒక మహిళా ప్రజాప్రతినిధి పట్ల ఇలాగేనా ప్రవర్తించేది?

ఈయనకు ఏమైనా పిచ్చా? ఒక మహిళా ప్రజాప్రతినిధి పట్ల ఇలాగేనా ప్రవర్తించేది?
Advertisement

కేరళ రాజకీయాల్లో ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తిరువనంతపురంలోని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) ప్రధాన కార్యాలయంలో.. 71 ఏళ్ల సీనియర్ కాంగ్రెస్ నేత చెరియన్ ఫిలిప్ ఒక మహిళా ఎమ్మెల్యే పట్ల ప్రవర్తించిన తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కొల్లాం నుంచి కొత్తగా ఎన్నికైన మహిళా ఎమ్మెల్యే బిందు కృష్ణను ఆయన బలవంతంగా కౌగిలించుకోవడానికి ప్రయత్నించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కేపీసీసీ కార్యాలయానికి వచ్చిన బిందు కృష్ణకు అక్కడ ఉన్న నాయకులు.. మీడియా ప్రతినిధులు స్వాగతం పలికారు. ఆమె అందరికీ నమస్తే చెబుతూ.. కొందరితో కరచాలనం (Handshake) చేస్తూ వెళ్లారు. అదే సమయంలో ఎదురుపడిన చెరియన్ ఫిలిప్‌కు కూడా ఆమె షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చేయి చాచారు. అయితే ఆమె చేతిని పట్టించుకోని ఫిలిప్.. ఏకంగా ఆమె భుజాలపై చేతులు వేసి బలవంతంగా కౌగిలించుకునేందుకు ప్రయత్నించారు. బిందు కృష్ణ స్పష్టంగా అసౌకర్యానికి లోనవుతూ ఆయనను పక్కకు నెట్టివేసినా.. ఆయన మాత్రం వదలకుండా మళ్లీ ఆమెను దగ్గరకు లాక్కునేందుకు ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement

ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. “ఈయనకు ఏమైనా పిచ్చా? ఒక మహిళా ప్రజాప్రతినిధి పట్ల ఇలాగేనా ప్రవర్తించేది?” అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక కార్యకర్త శ్రీజ నెయ్యట్టింకర స్పందిస్తూ.. “ఒక మహిళా నాయకురాలు కరచాలనం కోసం చేయి చాచినప్పుడు.. ఆమె అనుమతి లేకుండా బలవంతంగా భుజాలపై చేయి వేయడం అత్యంత అసభ్యకరం. ఆమె తోసివేసినా మళ్లీ కౌగిలించుకోవడానికి ప్రయత్నించడం ఆయన వక్రీకృత బుద్ధికి నిదర్శనం.” అని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళా ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

చెరియన్ ఫిలిప్‌కు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో 2015లో కూడా ఆయన మహిళా కాంగ్రెస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అప్పట్లో “మహిళలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు లైంగిక ప్రయోజనాల కోసం దక్కుతాయి” అనే అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఇప్పుడు మళ్లీ ఒక మహిళా ఎమ్మెల్యే పట్ల ఆయన ప్రవర్తించిన తీరుతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ ఘటన కేరళ కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడేసింది.

Advertisement

Tags

Related News

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కే ‘తిరంగా యాత్ర’ అడ్డుకున్న పోలీసులు.. ఇంటికెళ్లి నోటీసులు అందజేత!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో

నా ఇంటి చుట్టూ నిఘా పెట్టారు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?

Big Stories

Advertisement
×