E-Paper
Advertisement

దుర్గామాత పందిరి కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

దుర్గామాత పందిరి కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన
Advertisement

Kolkata Stampede: దసరా నవరాత్రుల్లో భాగంగా కోల్‌కతాలో ఘోర ప్రమాదం జరిగింది. చోర్‌బాగన్ దుర్గాదేవి పూజా పందిరి కూలిపోయింది. ఆ క్రమంలో పందిరిలోతొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 19 మంది భక్తులు మృతి చెందగా, మరో రెండు డజన్లకు పైగా భక్తులు గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణకు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆదేశించారు.

కోల్‌కత్తాలో తీవ్ర విషాదం.. కూలిన దుర్గామాత పందిరి

దేశంలోని ప్రధాన నగరాల్లో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం రాత్రి కోల్‌కతాలోని దుర్గా మాత మందిరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 7.40 గంటలకు చోర్‌బాగన్ ప్రాంతంలోవున్న దుర్గా పూజా పందిరి వర్షానికి కుప్పకూలింది. ఈ ఘటనలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 19 మంది భక్తులు మరణించారు. మరో 25 మంది వరకు భక్తులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూజా నిర్వాహకులతోపాటు 12 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు కోల్‌కతా పోలీసులు.

19 మంది మృతి, 25 మందికి గాయాలు

Advertisement

గిరీష్ పార్క్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దుర్గా మాత పందిరి సందర్శకులతో నిండిపోయింది.అదే మయంలో రాత్రి భారీ వర్షం పడడంతో భక్తులంతా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వర్షం మొదలుకావడంతో పందిరి బయట వేచి ఉన్న జనం ముందుకు దూసుకెళ్లారు. ఒక్కసారిగా పందిరి కూలిపోవడంతో తొక్కిసలాట జోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత చోర్‌బాగన్ పూజా కమిటీ ప్రధాన కార్యదర్శి, అధికారులు రాజీనామా చేశారు. ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి సువేందు అధికారి విచారం వ్యక్తం చేశారు.

విచారణకు ఆదేశించిన సీఎం, ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ

ప్రమాదం ఘటనపై విచారణకు ఆదేశించారు. గాయపడిన బాధితులను కలకత్తా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అటు సీఎం సువేందు అధికారి ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. శారదా పార్క్ పూజా పందిరి ఎగ్జిట్ ద్వారా వద్ద ఈ ఘటన జరిగింది. ప్రస్తుతానికి ఆ పందిరిని మూసివేశారు. ఈ ఘటన నేపథ్యంలో మిగతా దుర్గాదేవి పందిరి నిర్వాహకులు అలర్ట్ అయ్యారు, పలు ప్రాంతాల్లో పందిళ్లను మూసివేశారు.

Advertisement

ALSO READ: రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు

దుర్గా పూజా పండాల్ కూలిన ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆమె సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. కోల్‌కతా ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

చాలా బాధాకరమని ప్రధానమంత్రి కార్యాలయం జారీ చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలా సహాయం అందిస్తోందని తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్-గ్రేషియా ప్రకటించారు ప్రధానమంత్రి. గాయపడిన వారికి కూడా రూ. 50 వేల ఆర్థిక సహాయం అందనుంది.

 

Tags

Related News

ఆలయంలోని దూసుకెళ్లిన లారీ, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

Big Stories

Advertisement
×