E-Paper
Advertisement

LPG Cylinder Save Tips: మీ వంట గ్యాస్ ను ఆదా కోసం సింపుల్ చిట్కాలు

LPG Cylinder Save Tips: మీ వంట గ్యాస్ ను ఆదా కోసం సింపుల్ చిట్కాలు
Advertisement

LPG Cylinder Save Tips: ఇరాన్ వార్ మన వంటింటిపై పడింది. ఇప్పటికే వంట గ్యాస్ ధరలు పెరిగాయి. రానున్న రోజుల్లో గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో వంట గ్యాస్ పొదుపుగా వాడుకుంటే.. మన జేబుపై ఒత్తిడి తగ్గుతుంది. వంట గ్యాస్ ఆదా చేసుకునే టిప్స్ తెలుసుకుందాం. గ్యాస్ ఆదాకు వంట పాత్రలు చాలా ముఖ్యం. వంటకు ఎల్లప్పుడూ చదునుగా ఉండే పాత్రలను ఎంచుకోవాలి. ఇవి బర్నర్ పై సరిగ్గా కూర్చొంటాయి. దీంతో గ్యాస్ మంట పక్కకు పోకుండా నేరుగా పాత్రను తగులుతుంది. వంట పాత్ర అడుగు భాగం వంకరగా ఉంటే మంట పక్కకు పోయి.. ఆహారం ఉడికేందుకు ఎక్కువ టైం పడుతుంది. ఫలితంగా ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుంది.

మీడియం మంటపై

పెద్ద మంటపై ఆహారం త్వరగా ఉడుకుతుంది, గ్యాస్ తక్కువ ఖర్చవుతుందని అనుకుంటాం. కానీ హై హీట్ ఆహారాన్ని కాల్చేస్తుంది. అలాగే ఎక్కువ గ్యాస్‌ను కూడా తీసుకుంటుంది. కూరగాయలు, పప్పులు, రైస్ ను మీడియం లేదా తక్కువ హీట్ లో వండితే బెటర్. దీనివల్ల గ్యాస్ ఆదా అవుతుంది, ఆహారం బాగా ఉడుకుతుంది. ఆహారాన్ని ఉడికించేందుకు ప్రెషర్ కుక్కర్‌ను వాడడం మంచిది. ప్రెషర్ కుక్కర్‌లో ఆహారం తక్కువ టైంలోనే ఉడికిపోతుంది. కూరగాయలు, బీన్స్, చిక్‌పీస్, రైస్ వంటి వాటిని ప్రెషర్ కుక్కర్‌లో ఉడికిస్తే… తక్కువ గ్యాస్ ఖర్చు అవుతుంది.

మూత పెట్టడం

Advertisement

వంట చేసేటప్పుడు పాత్రలపై మూత పెట్టడం మంచి అలవాటు. మూత లేకుండా వంట చేయడం వల్ల ఆవిరి బయటకు వెళ్లి ఆహారం ఉడికేందుకు లేట్ అవుతుంది. మూత ఉపయోగించడం వల్ల ఆవిరి బయటకు వెళ్లకుండా ఆహారం తొందరగా ఉడుకుతుంది. దీనివల్ల గ్యాస్ కూడా ఆదా అవుతుంది. వీటన్నింటి కంటే.. బర్నర్ క్లీనింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి. బర్నర్ హోల్స్ మూసుకుపోయినా లేదా తుప్పు పేరుకుపోయినా, గ్యాస్ సరిగ్గా మండదు. ఫలితంగా గ్యాస్ వినియోగం పెరుగుతుంది. కనీసం వారానికి ఒకసారి అయినా బర్నర్‌ను క్లీన్ చేయడం మంచిది. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే గ్యాస్‌ ఆదా ఆవుతుంది.

Also Read:  రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు.. వదంతులు నమ్మవద్దు: మంత్రి నాదెండ్ల మనోహర్

Related News

30 దాటాక పెళ్లి చేసుకుంటున్నారా? ఈ 5 విషయాలు ముందే చర్చించకపోతే జీవితాంతం పశ్చాత్తాపమే!

45 రోజుల పాటు రోజుకో అరటిపండు తింటే బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

32 కేజీల బరువు తగ్గిన ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆ 5 ఆహారాలను దూరం పెట్టడం వల్లే అంటూ సీక్రెట్ రివీల్!

నెల చివరికి జేబు ఖాళీ.. జీతం సరిపోవడం లేదా? ఈ స్మార్ట్ ఫైనాన్సియల్ టిప్స్ మీ కోసమే

బిగుతుగా ఉన్న బ్రా వేసుకుంటే రొమ్ము క్యాన్సర్ వస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

పచ్చి పాలు తాగడం వల్ల యువకుడికి గుండె సమస్య.. హెచ్చరిస్తున్న డాక్టర్లు

ప్రేమ అంటే రక్తంతో లవ్ లెటర్స్ రాయడం కాదు.. ఒక్కడే కొండను చీల్చిన ప్రేమికుడు

పిల్లల ప్రవర్తనలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే తల్లిదండ్రులు తప్పు చేస్తున్నట్లే..

Big Stories

Advertisement
×