E-Paper
Advertisement

LPG Cylinder Booking: వంట గ్యాస్‌పై మరో పిడుగు.. బుకింగ్ గడువు రోజులను మరింత పెంచిన కేంద్రం

LPG Cylinder Booking: వంట గ్యాస్‌పై మరో పిడుగు.. బుకింగ్ గడువు రోజులను మరింత పెంచిన కేంద్రం
Advertisement

LPG Cylinder Booking: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ప్రభావం భారత్ పై పడుతుంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ లభ్యతపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. వంట గ్యాస్ ధరలు పెరుగుతుండడంతో ప్రజలు భారీగా బుకింగ్ చేసుకుంటున్నారు. దీంతో కేంద్ర ఇప్పటికే గ్యాస్ బుకింగ్ 25 గడువు విధించింది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో వంట గ్యాస్ బుకింగ్ గడువును 25 నుంచి 45 రోజులకు పెంచింది. పట్టణాలు, నగరాల్లో గ్యాస్ బుకింగ్ గడువును 25 రోజులుగా నిర్ణయించింది.

వినియోగదారుల్లో ఆందోళన

మిడిల్ ఈస్ట్ లో రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్ లో ఎల్పీజీ సిలిండర్ల కొరత వస్తుందని ఆందోళనలు నెలకొన్నాయి. ఇంధన మార్కెట్లలో అంతరాయాలు కారణంగా దేశంలో వంటి గ్యాస్ సరఫరాను ప్రభావితం చేస్తాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదని, గ్యాస్ సరఫరాలో గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎల్పీజీ సరఫరాపై ప్రజలు భయపడవద్దని కోరింది. అదనపు సిలిండర్లను బుక్ చేసుకోవడానికి తొందరపడవద్దని సూచించింది.

హోటళ్లు బంద్

Advertisement

ఇరాన్ యుద్ధం కారణంగా వంట గ్యాస్ కొరతపై పుకార్లు చెలరేగాయి. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సరఫరా తగ్గడంతో హోటళ్లు బంద్ అయ్యాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా LPG సరఫరా స్థిరంగా ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏవైనా సరఫరా సమస్యలు తలెత్తితే కమర్షియల్ వినియోగదారుల కంటే వంట గ్యాస్ వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తామని అధికారులు తెలిపారు.

45 రోజులకు పెంపు

ఇందులో భాగంగా ముందుగా LPG బుకింగ్ పై 21 రోజుల గడువు విధించింది. ఆ తర్వాత రీఫిల్ సిలిండర్‌ను బుకింగ్ ను 25 రోజులకు పెంచింది. తాజాగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ సర్దుబాటు అమల్లో ఉన్నప్పటికీ, వంట గ్యాస్ సిలిండర్లను అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు.

అదనపు డబ్బులు డిమాండ్ చేస్తే

Advertisement

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కోసం జనం క్యూ కట్టండంతో డీలర్లు అదనపు డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు అందుతున్నాయి. ఎవరైనా అదనపు డబ్బు డిమాండ్ చేసిన, బుకింగ్ చేసిన సిలిండర్ డెలివరీకి నిరాకరించినా LPG ప్రొవైడర్ అధికారిక హెల్ప్‌లైన్‌ కు ఫిర్యాదు చేయవచ్చు. బ్లాక్ మార్కెట్ విక్రయాలకు పాల్పడే డీలర్లపై అధికారులు చర్యలు తీసుకుంటారని కేంద్రం తెలిపింది.

ఇండేన్ గ్యాస్ హెల్ప్‌లైన్ నంబర్

1800-2333-555 (టోల్ ఫ్రీ)
7718955555 (LPG బుకింగ్, కంప్లైంట్స్)

ఈ హెల్ప్‌లైన్ కు ఫోన్ చేసి లేట్ డెలివరీలు, అధిక ఛార్జీలు లేదా LPG పంపిణీకి ఇతర సమస్యలను రిపోర్టు చేయవచ్చు.

భారత్ గ్యాస్ హెల్ప్‌లైన్ నంబర్

1800-22-4344 (టోల్ ఫ్రీ)
7715012345 (LPG బుకింగ్)

HP గ్యాస్ హెల్ప్‌లైన్ నంబర్

1800-2333-555 (టోల్ ఫ్రీ)
9493602222 (HP ఎనీటైమ్ LPG)

ఈ హెల్ప్‌లైన్‌లు ఎల్పీజీ బుకింగ్, ఫిర్యాదులకు 24 గంటలు అందుబాటులో ఉంటాయి.

Also Read:  గ్యాస్ సిలిండర్ కొరత ఉన్నా చింత లేదు.. ఈ 5 పద్ధతులతో వంట చేయడం చాలా ఈజీ!

 

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×