E-Paper
Advertisement

Bhoothpur Tragedy: విషాదం.. కన్న బిడ్డలను బావిలోకి తోసేసి.. తల్లి కూడా!

Bhoothpur Tragedy: విషాదం.. కన్న బిడ్డలను బావిలోకి తోసేసి.. తల్లి కూడా!
Advertisement

Bhoothpur Tragedy: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వెల్కిచర్ల గ్రామంలో గురువారం ఉదయం కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురైన ఓ తల్లి, తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

వెల్కిచర్ల గ్రామానికి చెందిన జంగమ్మ (42)అనే మహిళకు తన కుటుంబంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే విరక్తి చెందిన ఆమె, గురువారం ఉదయం తన కుమార్తెలు జ్యోతి (15), శైలజ (13),కుమారుడితో కలిసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లింది. అక్కడ ఎవరూ లేని సమయం చూసి, తన ఇద్దరు కుమార్తెలను బలవంతంగా బావిలోకి నెట్టేసింది. ఆ తర్వాత తాను కూడా బావిలోకి దూకి తనువు చాలించింది.

Advertisement

తల్లి తన అక్కలను బావిలోకి తోసేయడం చూసిన కుమారుడు భయంతో అక్కడి నుండి తప్పించుకున్నాడు. తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడిన ఆ బాలుడు పరుగున వెళ్లి గ్రామస్థులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో వెల్కిచర్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆత్మహత్యకు దారితీసిన అసలు కారణాలపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Also Read:  షాపూర్ వద్ద లారీ బీభత్సం.. ఇద్దరు ఇంటర్ విద్యార్థుల బలి

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×