E-Paper
Advertisement

Shahid Afridi: ఫైన‌ల్స్ త‌ర్వాత‌ హ‌ర్ధిక్ పాండ్యాకు డ్ర‌గ్స్ టెస్ట్ చేయించాల్సింది

Shahid Afridi: ఫైన‌ల్స్ త‌ర్వాత‌ హ‌ర్ధిక్ పాండ్యాకు డ్ర‌గ్స్ టెస్ట్ చేయించాల్సింది
Advertisement

Shahid Afridi:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026 ) విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad)  వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, Final) మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో 96 పరుగుల తేడాతో ఇండియా విక్టరీ సాధించింది. దీంతో అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలోనే టీమ్ ఇండియా ప్లేయర్లు రెచ్చిపోయి ఎంజాయ్ చేశారు. అయితే ఈ సందర్భంగా టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) కాస్త ఓవర్ గా బిహేవ్ చేసిన సంగతి తెలిసిందే. తన ప్రియురాలు మహిక శర్మ ( Mahieka Sharma ), హార్దిక్ పాండ్యా స్టేడియం లోనే రొమాన్స్ చేయడం మొదలుపెట్టారు.

Also Read: T20 World Cup 2026: కొంప‌ముంచిన‌ గిల్ సెల‌క్ష‌న్…గంభీర్, అగార్క‌ర్ మ‌ధ్య గొడ‌వ‌లు, టీమిండియాలో ప్ర‌కంప‌న‌లు !

జై షా ముందు రెచ్చిపోయిన హార్దిక్ పాండ్యా

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా ఓవర్ గా బిహేవ్ చేశాడు. జాతీయ జెండాను కప్పుకొని తన ప్రియురాలు మహికా శర్మతో రొమాన్స్ చేశాడు. ఆ తర్వాత టైటిల్ అందుకునే క్రమంలో ఐసీసీ బాస్ జై షా ( ICC Jay Shah) ముందు కుప్పిగంతులు వేశాడు. అతని హగ్గు చేసుకుని, ఒక ఊపు ఊపేశాడు. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఐసీసీ బాస్ జై షా అంటే అందరికీ భయం ఉండాలి.. ఆయన అన్ని క్రికెట్ బోర్డులకు హెడ్.. అలాంటి వ్యక్తి ముందు హార్దిక్ పాండ్యా చిల్లర వేషాలు వేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు షాహిద్ ఆఫ్రీది.

జై షా ఇండియా వాడు అయినప్పటికీ ఐసీసీకి బాస్.. ఆ విషయం కూడా గుర్తు లేదా అంటూ హార్దిక్ పాండ్యా పరువు తీశాడు. స్టేడియంలోనే తన ప్రియురాలి మ‌హికా శ‌ర్మ‌తో అందరి ముందే చిల్లరగా బిహేవ్ చేశాడని మండిపడ్డారు. అతని ప్రవర్తన చూస్తుంటే డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం వ్యక్తం అవుతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు షాహిద్ ఆఫ్రీది. ఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత హార్దిక్ పాండ్యాకు డ్రగ్స్ టెస్ట్ ( drug test for hardik pandya) చేయించి ఉంటే బాగుండేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

హ‌ర్ధిక్ పాండ్యాపై ఇప్ప‌టికే కేసు న‌మోదు

Advertisement

భారతీయ జెండా కప్పుకొని మహికా శర్మతో హార్దిక్ పాండ్యా రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పూణేకు చెందిన ఓ లాయర్ కేసు పెట్టాడు. ఆధారాలతో అడ్డంగా ఇరికించాడు. దీంతో హార్దిక్ పాండ్యా పై ఎఫ్ ఐ ఆర్ నమోదు అయినట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: T20 World Cup 2026: సంజు అదిరిపోయే ఇన్నింగ్స్‌..ఉద్యోగుల‌కు రూ.2.5 లక్షలు బోన‌స్ ఇచ్చిన కేర‌ళ వ్యాపార‌వేత్త‌

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×