E-Paper
Advertisement

Wife Caught: భార్య సీక్రెట్ యవ్వారం.. ప్రియుడితో కలిసి హోటల్‌లో, చివరకు ఆమె భర్త ఏం చేశాడు?

Wife Caught:  భార్య సీక్రెట్ యవ్వారం.. ప్రియుడితో కలిసి హోటల్‌లో, చివరకు ఆమె భర్త ఏం చేశాడు?
Advertisement

Wife Caught: పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి వివాహేతర సంబంధాలు. దీని బారినపడి చాలా ఫ్యామిలీలు ఛిన్నాభిన్నం అయ్యాయి.. అవుతున్నాయి కూడా. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. వివాహం జరిగిన ఏడేళ్ల నుంచి భర్తని మోసం చేస్తూ వచ్చింది భార్య. చివరకు ప్రియుడితో కలిసి హోటల్‌లో ఉండగా భర్తకు చిక్కింది. ఈ ఘటన అమృతసర్ లో వెలుగుచూసింది.

చిచ్చుపెట్టిన వివాహేతర సంబంధాలు

Advertisement

పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన రవి గులాటి-హిమానికి సరిగ్గా 15 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఏప్రిల్ 25, 2010న ఇరు కుటుంబాల పెద్దల సాక్షిగా వీరిద్దరు ఒక్కటయ్యారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. హాయిగా సాగిపోతున్న వీరి సంసారంలోకి ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు.

అతడు ఎలా వచ్చాడన్నది కాసేపు పక్కన పెడదాం. ఈ క్రమంలో హిమాని ఆ వ్యక్తికి బాగా దగ్గరయ్యాడు. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి. అలాగని హిమాని తన భర్తకు దూరంగా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే ఆ జంటకు ఇద్దరు పిల్లలు ఉండడమే ఇందుకు కారణం.

Advertisement

ప్రియుడితో కలిసి హోటల్‌లో భార్య, చివరకు భర్త ఏం చేశాడు?

ఓ వైపు భర్తతో కాపురం చేస్తూ మరోవైపు వివాహేతర సంబంధానికి కనెక్ట్ అయ్యింది. వివాహం జరిగిన ఎనిమిదేళ్లకు అంటే 2018లో తన ప్రియుడితో కలిసి ఒక హోటల్‌లో హిమాని ఉండగా భర్తకు అడ్డంగా దొరికిపోయింది. హోటల్ నుంచి భార్య ఇంటికి వచ్చిన  తర్వాత  రవి గట్టిగానే హెచ్చరించాడు.

ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో వెంటనే అల్లుడికి ఇంటికి వచ్చారు. భార్య, ఆమె తల్లిదండ్రులు అల్లుడికి క్షమాపణలు చెప్పారు.ఇంతవరకు బాగానే స్టోరీ సాగింది. ఆనాటి నుంచి భార్య కదలికలపై ఓ కన్నేశాడు భర్త రవి గులాటి. ఆమె స్కూటీకి జీపీఎస్ ట్రాకర్‌ని అమర్చాడు.

వారం రోజులుగా హిమాని మనసు ప్రియుడి వైపుకు మళ్లింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం ప్రియుడితో కలిసి హోటల్‌కి వెళ్లింది. అప్పటికే పని మీద బయటకు వెళ్లిన రవి, ఇంటికి వచ్చేసరికి భార్య కనిపించలేదు. ఆ తర్వాత ఫోన్ ఎంతకీ లిప్ట్ చేయలేదు.

ALSO READ: జనవరి ఒకటి నుంచి భారత్ ట్యాక్సీ యాప్.. వాటి మాటేంటి?

ఆ తర్వాత భార్య స్కూటీని ట్రాక్ చేస్తే, ఓ హోటల్ దగ్గర ఉన్నట్టు కనిపించింది. తన వాహనంలో నేరుగా ఆ హోటల్‌కి వెళ్లాడు రవి. మరొక వ్యక్తితో రెడ్ హ్యాండెడ్‌గా భార్యని పట్టుకున్నాడు. ఇప్పటికే ఒకసారి ఇలాంటి ఘటన జరిగిందని, ఇది రెండోసారని చెప్పాడు రవి. హిమానితో కలిసి ఉండేది లేదని తేల్చిచెప్పాడు.

స్థానిక రాజకీయ నేతలు ఈ దంపతుల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు చేశారు. విఫలం కావడంతో హిమాని పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో వెక్కి వెక్కి ఏడ్చాడు ఆమె భర్త రవి. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

 

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×