E-Paper
Advertisement

Panchayat Elections: తెలంగాణ గ్రామాల్లో కొత్త నాయకత్వం.. హోరాహోరీగా సాగిన మూడు విడతల పంచాయతీ ఎన్నికలు!

Panchayat Elections: తెలంగాణ గ్రామాల్లో కొత్త నాయకత్వం.. హోరాహోరీగా సాగిన మూడు విడతల పంచాయతీ ఎన్నికలు!
Advertisement

Panchayat Elections: తెలంగాణలో పల్లె పోరు ముగియడంతో గ్రామీణ ప్రాంతాల్లో కొత్త నాయకత్వం కొలువుదీరింది. మొత్తం మూడు విడతల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు. ముఖ్యంగా మూడో విడతలో 4,159 స్థానాలకు గాను మెజారిటీ స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుని తన హవాను చాటుకుంది. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, కేవలం కొన్ని జిల్లాలకే పరిమితమైంది. బీజేపీ నిర్మల్ వంటి ప్రాంతాల్లో తన పట్టును నిరూపించుకోగా, స్వతంత్ర అభ్యర్థులు కూడా గణనీయమైన సంఖ్యలో విజయం సాధించారు.

మూడో విడత ఎన్నికల ఫలితాలు
ఏకగ్రీవాలతో కలిపి.. కాంగ్రెస్‌ పార్టీకి 2246, బీఆర్ఎస్ 1,162 , బీజేపీ 246 , ఇతరులు 491 సర్పంచ్‌ స్థానాల్లో విజయం సాధించారు. రెండో విడతలో కాంగ్రెస్‌ మద్దతుదారులు 2,245 చోట్ల, బీఆర్ఎస్ 1,188, బీజేపీ 268, ఇతరులు 624 చోట్ల గెలుపొందారు.

Advertisement

మొత్తం సర్పంచ్ ఎన్నికల తుది ఫలితాలు..
మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల తుది ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచాయి. మొత్తం 12,726 సర్పంచ్ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో, కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధికంగా 6,726 (52.85%) స్థానాలను కైవసం చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో తమ పట్టును నిరూపించుకున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు 4,031 (31.67%) స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానంలో నిలవగా, బీజేపీ మద్దతుదారులు 697 (5.47%) స్థానాలకే పరిమితమయ్యారు. ఇకపోతే, స్వతంత్రులు, ఇతర పార్టీల మద్దతుదారులు కలిపి 1,272 (9.99%) చోట్ల గెలుచుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల మొత్తం శాతం..
ఎన్నికల మొత్తం ఫలితాలను పరిశీలిస్తే, మూడు విడతల్లోనూ ఓటర్లు చలిని సైతం లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సగటున 85% పైగా ఓటింగ్ నమోదు కావడం విశేషం. మొదటి విడతలో 84.28 శాతం, రెండో విడతలో 85.86 శాతం పోలింగ్ నమోదు కాగా, మూడో విడతలో 85.77 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మూడు విడతల్లోనూ యాదాద్రి భువనగిరి జిల్లా అత్యధికంగా 92.56 శాతానికి పైగా పోలింగ్‌తో అగ్రస్థానంలో నిలిచి ఓటర్ల చైతన్యాన్ని చాటింది.

Advertisement

జిల్లాల వారీగా విశ్లేషిస్తే కొత్తగూడెం, మహబూబాబాద్, నల్గొండ, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, కామారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం వంటి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది. అయితే, బీఆర్ఎస్ మాత్రం తన పట్టున్న గద్వాల్, ఆదిలాబాద్, సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో మెజారిటీ స్థానాలను నిలబెట్టుకోగలిగింది. కరీంనగర్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మాత్రం రెండు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగి, సమాన స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిర్మల్ జిల్లాలో మాత్రం బీజేపీ తన ఉనికిని బలంగా చాటుతూ మెజారిటీ స్థానాలను సాధించింది.

Also Read: ఇప్పుడు కాక ఇంకెప్పుడు? మోడీ అక్షింతలు మారని నేతల తీరు!

అయితే ఎన్నికల కమిషన్ నివేదిక ప్రకారం, ఈసారి గతంతో పోలిస్తే ఏకగ్రీవాల సంఖ్య తగ్గింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టడంతో, ఎక్కడా పెద్దగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది.

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×