E-Paper
Advertisement

Railway Reservation Charts: ఇకపై 10 గంటల ముందే రిజర్వేషన్‌ చార్టు, రూల్స్ మార్చిన ఇండియన్ రైల్వే!

Railway Reservation Charts: ఇకపై 10 గంటల ముందే రిజర్వేషన్‌ చార్టు, రూల్స్ మార్చిన ఇండియన్ రైల్వే!
Advertisement

Indian Railway: ప్రయాణీకుల సౌకర్యం కోసం భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే మరో ముఖ్యమైన నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై రైలు బయల్దేరడానికి 10 గంటల ముందే రిజర్వేషన్‌ చార్టు సిద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రయాణికులలో టెన్షన్ తగ్గించి, ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

4 గంటల నుంచి 10 గంటలకు పెంపు

రైల్వేశాఖ రిజర్వేషన్‌ చార్టు రూపొందించే సమయాన్ని తాజాగా సవరించింది. ఇప్పటి వరకు రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు మాత్రమే రిజర్వేషన్‌ చార్టును రెడీ చేసేవారు. ఈ విధానం వల్ల వెయిటింగ్‌ లిస్ట్‌ లో ఉన్న ప్రయాణికులు తమకు సీటు దొరుకుతుందో? లేదో? అనే టెన్షన్ పడే వారు. ఒకవేళ బెర్త్ కన్ఫార్మ్ కాకపోతే అప్పటికప్పుడు ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడేవారు. పది గంటలు ముందుగా చార్టు సిద్ధం చేయడం వల్ల టికెట్ లభించకపోతే, ఈజీగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకనే అవకాశం ఉంటుంది. అన్ని రైల్వే జోన్లు ఈ విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని తాజాగా  రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

ఛార్ట్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే?

Advertisement

ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బయలుదేరే రైళ్లకు సంబంధించిన  తొలి ఛార్ట్ ను ముందు రోజు రాత్రి 8 గంటల వరకు రెడీ రైల్వే అధికారులు రెడీ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 12.00 గంటల వరకు,  అర్థరాత్రి 12.00 గంటల నుంచి ఉదయం 5.00 గంటల వరకు బయల్దేరే రైళ్లకు సంబంధించిన ఛార్ట్ లను కనీసం 10 గంటల ముందు రూపొందించేలా చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డు సూచించింది. ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం చర్యలు చేపట్టాలని ఇప్పటికే దేశంలోని అన్ని జోనల్ కార్యాలయాలకు రైల్వే బోర్డు లేఖ పంపించింది.

Read Also: హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు వందే భారత్, గరీబ్ రథ్‌లు నడపండి ప్లీజ్!

రైళ్లలో తీసుకెళ్లే లగేజీ పైనా పరిమితులు  

Advertisement

అటు రైళ్లలో తీసుకెళ్లే లగేజీ విషయంలోనే రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. గతంలో ఉన్న లగేజీ పరిమితుల విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదని వెల్లడించింది. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. రైల్లో ప్రయాణించే సమయంలో నిర్దేశిత బరువు దాటిన లగేజీకి చార్జీలు చెల్లించాల్సిందేనని లోక్‌ సభలో వెల్లడించారు. ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించే వారికి 70 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి ఉన్నట్లు తెలిపారు. ఏసీ టూటైర్‌లో 50 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు. ఏసీ త్రీటైర్‌ లో 40 కేజీల వరకు లగేజీ తీసుకు వెళ్లేందుకు అనుమతి ఉన్నట్లు తెలిపారు. జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి కేవలం 35 కిలోల లగేజీ తీసుకు వెళ్లే అవకాశం ఉందని వివరించారు. పరిమితి దాటి లగేజీ తీసుకెళ్తే అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని వైష్ణవ్ వెల్లడించారు.

Read Also: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్!

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×