BigTV English

Marriage Cancelled : హవ్వా.. ఆ పని చేయలేకపోయిన వరుడు.. పెళ్లి క్యాన్సిల్ !

Marriage Cancelled : హవ్వా.. ఆ పని చేయలేకపోయిన వరుడు.. పెళ్లి క్యాన్సిల్ !

Marriage Cancelled Due to Second Table : ఇటీవలే పెళ్లిళ్ల సీజన్ ముగిసింది. దేశవ్యాప్తంగా కొన్నివేల జంటలు ఈ పెళ్లిళ్ల సీజన్ లో ఒక్కటయ్యాయి. ఎవరికి వారే తమకున్నంతలో గ్రాండ్ గా పెళ్ళిళ్లు చేసుకున్నారు. ఐదురోజుల పెళ్లిళ్లు, హల్దీ, మెహందీ, సంగీత్ లతో.. ప్రీ వెడ్డింగ్ షూట్ లతో జీవితంలో ఒక్కసారే వచ్చే వివాహ వేడుకను ఎంజాయ్ చేశారు. కొన్నిసార్లు పెళ్లిళ్లలో వింత ఘటనలు జరుగుతుంటాయి. ఈ ఘటన కూడా అలాంటిదే. పెళ్లికొడుకు ఒక పని చేయలేకపోవడంతో పెళ్లి ఆగిపోయింది.


బాగా చదువుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్న వధువు.. పెళ్లికి ముందు వరుడి బండారం బయటపడటంతో ఆ పెళ్లిని రద్దు చేసుకుంది. విచిత్రం ఏంటంటే.. ఆ వరుడు రెండో ఎక్కం కూడా చెప్పలేకపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మెహబూబా జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లి నిశ్చయించే సమయంలో.. వరుడు బాగా చదువుకున్నాడని చెప్పారు. కానీ.. పెళ్లి పీటల వద్ద అతను నోరు జారాడు.

పీటలపై కూర్చున్న నూతన వధూవరులు దండలు మార్చుకునే సమయంలో.. పంతులు మంత్రాలు చెబుతూ.. తనను అనుసరించమన్నాడు. ఈ మంత్రాలు, లెక్కలు నాకసలు రావని నోరు జారాడు. ఏదో సరదాకి అన్నాడని కవర్ చేద్దామన్నా కుదరలేదు. దాంతో పెళ్లికి ముందు వరుడికి చిన్న టెస్ట్ పెట్టింది.


రెండో ఎక్కం చెప్పమంటే.. మనోడి నోరు పెగల్లేదు. దాంతో అతనేమీ చదువుకోలేదని పెళ్లికూతురితో సహా.. అందరికీ తెలిసిపోయింది. వెంటనే వధువు మాల్సా పెళ్లిపీటల మీది నుంచి లేచి వెళ్లిపోయింది. అలా పీటల వరకూ వచ్చిన పెళ్లి క్యాన్సిలైంది.

 

 

Tags

Related News

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Big Stories

×