BigTV English

TDP Campaign vehicle burn: పెట్రోల్ పోసి.. ప్రచార వాహనాన్ని నిప్పు, డ్రైవర్ సేఫ్

TDP Campaign vehicle burn: పెట్రోల్ పోసి..  ప్రచార వాహనాన్ని నిప్పు, డ్రైవర్ సేఫ్

TDP Party Campaign News(Andhra politics news): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ హింస క్రమంగా  పెరుగుతోంది. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ ప్రచార వాహనాన్ని తగలబెట్టారు కొంతమంది వ్యక్తులు. పీలేరు మండంలోని వాల్మీకిపురం సమీపంలో ఈ ఘటన జరిగింది. డ్రైవర్ వాహనంలో ఉండగానే కొంతమంది వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. అయితే మంటలు గమనించిన డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకున్నారు.


శనివారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో టూ వీలర్‌పై వచ్చిన దుండగులు టీడీపీ ప్రచార వాహనంపై పెట్రోల్ వేసి నిప్పుపెట్టారు. వాహనంలో డ్రైవర్ రెస్ట్ తీసుకుంటున్న సమయంలో జరిగింది. ఈ ఘటనలో వాహనం కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఘటన విషయం తెలుసుకున్న వెంటనే టీడీపీ నేతలు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. అయితే స్థానిక సీఐ టీడీపీ నేతలను కన్వీన్స్ చేశారు. నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. టీడీపీ కేడర్ ఆందోళనతో దాదాపు రెండు కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ నిలిచి పోయింది.


ALSO READ: పిఠాపురం.. మద్యం ఎత్తులు, లిక్కర్ సీజ్ వెనుక..

ఈసారి పీలేరు నుంచి వైసీపీ తరపున చింతల రామచంద్రారెడ్డి, టీడీపీ నుంచి నల్లూరి కిషోర్‌కుమార్ రెడ్డి పోటీపడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి సొంత మండలం వాల్మీకిపురం. ఎన్నికల అధికారుల అనుమతితో ప్రత్యేక వాహనాన్ని తయారు చేశారు టీడీపీ నేతలు. సూపర్ సిక్స్  గ్యారెంటీ పథకాలతో ఫెక్సీలను ఏర్పాటు చేసి మూడురోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఈ వాహనాన్ని కొంతమంది అనుమానితులు వెంటబడినట్టు తెలుస్తోంది. టీడీపీని అడ్డుకునేందుకు ఈ పని చేసి ఉంటారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయట పడతాయో చూడాలి.

 

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×