E-Paper
Advertisement

Union Budget 2026: ఉగ్రవాద బెదిరింపులు.. పాక్, బంగ్లాదేశ్‌తో ఉద్రిక్తతలు.. భారీగా పెరిగిన రక్షణ బడ్జెట్

Union Budget 2026: ఉగ్రవాద బెదిరింపులు.. పాక్, బంగ్లాదేశ్‌తో ఉద్రిక్తతలు.. భారీగా పెరిగిన రక్షణ బడ్జెట్
Advertisement

Union Budget 2026:  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ – 2026లో రక్షణ శాఖకు భారీగా నిధులు కేటాయించారు. ఈసారి ఏకంగా రూ.7.85 లక్షల కోట్లను కేంద్రం ప్రకటించింది. గతేడాది రక్షణ శాఖకు రూ.6.81 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది దాదాపు 15 శాతం మేర నిధులు పెంచడం గమనార్హం. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ – పాక్ ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరడం, ఇటీవల బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేక ధోరణ పెచ్చుమీరడం, ఇటీవల దిల్లీ జరిగిన బాంబ్ బ్లాస్ట్, ఉగ్రదాడి బెదిరింపులను దృష్టిలో ఉంచుకొని రక్షణ శాఖ బడ్డెట్ ను కేంద్రం భారీగా పెంచినట్లు తెలుస్తోంది.

బడ్జెట్‌లో 14% రక్షణ శాఖకే..

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మెుత్తం బడ్జెట్ రూ. రూ.53.47 లక్షల కోట్లు కాగా.. అందులో రక్షణ శాఖకే దాదాపు 14.68 శాతం కేటాయింపు జరగడం విశేషం. ఆపరేషన్ సిందూర్ వంటి అతిపెద్ద సైనిక చర్య తర్వాత తీసుకొచ్చిన తొలి బడ్జెట్ లో ఈ స్థాయిలో రక్షణ శాఖకు ప్రాధాన్యం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. రక్షణశాఖకు కేటాయించిన రూ.7.85 లక్షల కోట్లలో.. సైన్యం ఆధునీకరణ కోసమే రూ.2.19 లక్ష కోట్లను ఖర్చు చేయనున్నారు. గతేడాది కేటాయింపులతో (1.8 లక్షల కోట్లు) పోలిస్తే ఇది 21.84 శాతం అధికం.

యుద్ధ విమానాలకు రూ.63 వేల కోట్లు..

Advertisement

రక్షణ శాఖ కేటాయింపుల్లో యుద్ధ విమానాలు, ఏరో ఇంజిన్లకు కోసం రూ.63,733 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే మందుగుండు సామాగ్రి, ఇంధనం, మరమ్మతులు, సహాయక సిబ్బంది జీతాలు కోసం రక్షణ బడ్జెట్ లో కేటాయింపులను 17.24 శాతానికి పెంచారు. విశ్రాంత సైనికుల పెన్షన్ల కోసం 6.53 శాతం అంటే రూ.1.71 లక్షల కోట్లను కేటాయించారు. కాగా పెరిగిన రక్షణ బడ్జెట్ దేశ జీడీపీలో 11 శాతంగా ఉంది.

Also Read: Budget 2026 Auto Updates: చౌకైన బ్యాటరీలు, CNG బ్లెండింగ్.. ఆటో ఇండస్ట్రీకి బడ్జెట్ బూస్టింగ్!

రక్షణ మంత్రి స్పందన ఇదే..

Advertisement

రక్షణ శాఖ బడ్జెట్ ను కేంద్రం భారీగా పెంచడంపై ఆ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఆపరేషన్ సిందూర్ వంటి చారిత్రాత్మక విజయం తర్వాత రక్షణ శాఖ బడ్జెట్ కేటాయింపులు పెంచారు. ఇది దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న సంకల్పాన్ని ప్రదర్శించింది. ఈ బడ్జెట్ భద్రత, అభివృద్ధి, స్వావలంబన మధ్య సమతుల్యతను బలపరిచింది’ అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. కాగా, యుద్ధ విమానాల నిర్వహణ, తయారీకి అవసరయ్యే విడి భాగాల దిగుమతులపై పన్నులను మినహాయించనున్నట్లు ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Also Read: Union Budget 2026: ‘ఆరెంజ్ ఎకానమీ’పై నిర్మల బడ్జెట్ ప్రసంగం.. యూత్‌కి ఉపాధి అవకాశాల వెల్లువ

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×