E-Paper
Advertisement

Budget 2026 Auto Updates: చౌకైన బ్యాటరీలు, CNG బ్లెండింగ్.. ఆటో ఇండస్ట్రీకి బడ్జెట్ బూస్టింగ్!

Budget 2026 Auto Updates:  చౌకైన బ్యాటరీలు, CNG బ్లెండింగ్.. ఆటో ఇండస్ట్రీకి బడ్జెట్ బూస్టింగ్!
Advertisement

Union Budget 2026 Auto Industry Highlights:  దేశంలో గ్రీన్ ఎనర్జీ, మొబిలిటీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయింపులు చేసింది. ముఖ్యంగా CNG, PNGలలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ను దశల వారీగా కలపడం తప్పనిసరి చేయడం నుంచి, తయారీ సపోర్టు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ద్వారా ఎలక్ట్రిక్ వాహన పర్యావరణ వ్యవస్థను విస్తరించడం వరకు, బడ్జెట్ లో కీలక అంశాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ ఉత్పత్తికి ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు ప్రకటించింది.

ఆటో ఇండస్ట్రీలకి బడ్జెట్ బూస్టింగ్

బడ్జెట్ లో భాగంగా నిర్మలా సీతారామన్..  రవాణా కోసం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ లో కంప్రెస్డ్ బయో గ్యాస్, గృహ అవసరాల కోసం పైప్డ్ నేచురల్ గ్యాస్ దశల వారీగా కలపడాన్ని తప్పనిసరి చేయాలని ప్రకటించారు. “తయారీ, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వడం ద్వారా మా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహన పర్యావరణ వ్యవస్థను విస్తరిస్తుంది. బలోపేతం చేస్తుంది” అని ఆర్థిక మంత్రి ప్రకటించారు. చెల్లింపు భద్రతా విధానాల ద్వారా ప్రజా రవాణా నెట్‌ వర్క్‌  కోసం ఎలక్ట్రిక్ బస్సులను ఎక్కువగా కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తామని ప్రకటించారు.

Advertisement

అటు పన్ను మినహాయింపు పొందిన వస్తువుల జాబితాలో EV బ్యాటరీ తయారీకి 35 అదనపు వస్తువులు, మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీకి 28 అదనపు వస్తువులను జోడించాలని బడ్జెట్ ప్రతిపాదించింది. “ఇది మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల కోసం లిథియం అయాన్ బ్యాటరీల దేశీయ తయారీని పెంచుతుంది” అని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

బ్యాటరీలో ఉపయోగించే ఖనిజాలపై పన్నుల మినహాయింపు

ఇక కోబాల్ట్ పౌడర్, వ్యర్థాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం, లిథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్, సీసం, జింక్, మరో 12 కీలకమైన ఖనిజాలను పూర్తిగా మినహాయించాలని బడ్జెట్ ప్రతిపాదించింది. ఇది దేశంలో తయారీకి వాటి లభ్యతను నిర్ధారించడానికి, యువతకు మరిన్ని ఉద్యోగాలను ప్రోత్సహించడానికి సహాయపడుతుందని ఆర్థిక మంత్రి అన్నారు. జూలై 2024 బడ్జెట్‌లో BCD నుండి పూర్తిగా మినహాయించబడిన 25 కీలకమైన ఖనిజాలకు ఇది అదనంగా ఉంటుందన్నారు.

Advertisement

Read Also: కేంద్ర బడ్జెట్.. ఎలక్ట్రిక్ కార్ల ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా?

యాక్సిడెంట్ బాధితుల పరిహారంపై నో ట్యాక్స్  

అటు కీలకమైన ప్రకటనలలో మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఒక సహజ వ్యక్తికి ఇచ్చే వడ్డీని 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను నుండి పూర్తిగా మినహాయించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. దీని ద్వారా లబ్దిపొందే కుటుంబ సభ్యులకు మంచి ఉపశమనం కలగనుంది. ఇంకా చెప్పాలంటే, లబ్ధిదారులు తగ్గింపులు లేకుండా  పరిహారాన్ని పూర్తిగా పొందనున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ నిర్ణయం ప్రమాద బాధితులకు ఎక్కువ ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఈ చెల్లింపు ప్రక్రియ పౌర సంక్షేమం, న్యాయం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Read Also: మరింత చౌకగా ఎలక్ట్రిక్ కార్లు.. నిర్మలమ్మ బడ్జెట్ పై ఆటో కంపెనీల ఆశలు!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×