E-Paper
Advertisement

Union Budget 2026: ‘ఆరెంజ్ ఎకానమీ’పై నిర్మల బడ్జెట్ ప్రసంగం.. యూత్‌కి ఉపాధి అవకాశాల వెల్లువ

Union Budget 2026: ‘ఆరెంజ్ ఎకానమీ’పై నిర్మల బడ్జెట్ ప్రసంగం.. యూత్‌కి ఉపాధి అవకాశాల వెల్లువ
Advertisement

Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరెంజ్ ఎకానమీ గురించి తన బడ్జెట్‌లో ప్రధానంగా ప్రస్తావించారు. తన మద్దతు ప్రకటించారు. ఉద్యోగాలు-సేవల ఆధారిత వృద్ధికి ఈ విభాగాన్ని కొత్త ఇంజిన్‌గా ప్రస్తావించారు. ఇంతకీ ఆరెంజ్ ఎకానమీ అంటే ఏమిటి? దీనిపై పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్రమోదీ కూడా ప్రస్తావించారు.

‘ఆరెంజ్ ఎకానమీ’పై నిర్మల బడ్జెట్ ప్రసంగం

Advertisement

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో కొత్త రంగానికి ప్రాణం పోశారు. అంతేకాదు తన మద్దతు కూడా ప్రకటించారు. ఇంతకీ ఆ రంగం ఏంటో తెలుసా? అదే ఆరెంజ్ ఎకానమీ. క్రియేటివిటీ, కళలు, వినోదాన్ని ఆధారంగా దేశంలో ఉద్యోగాలను క్రియేట్ చేయడాన్ని ఆమె పేర్కొన్నారు. యానిమేషన్, గేమింగ్ , విజువల్ ఎఫెక్ట్స్ వంటి రంగాల్లో భారత్‌ను అగ్రగామిగా తీర్చాలన్నది దీనివెనుక అసలు ఉద్దేశం.

వస్తువుల తయారీ, సేవల ద్వారా కాకుండా ఆలోచన ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆరెంజ్ ఎకానమీ. వ్యక్తి ఆలోచనలు, కళాత్మకత, మేధో సంపత్తి ద్వారా వచ్చే ఆదాయం అన్నమాట. అందులో యానిమేషన్, సంగీతం, సాఫ్ట్‌వేర్ డిజైనింగ్, కచేరీలు విభాగాలన్నమాట. నిర్మల తన బడ్జెట్‌లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్ రంగాలకు చేయూత ఇస్తున్నట్లు ప్రకటన చేశారు.

Advertisement

క్రియేటివిటీ రంగం.. యూత్‌కి ఉపాధి అవకాశాల వెల్లువ

సృజనాత్మక రంగంలో యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు విత్త మంత్రి. దేశ వ్యాప్తంగా 15 వేల సెకండరీ పాఠశాలు, 500 కాలేజీల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లు ఏర్పాటు కానున్నాయి. ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ- IICT ఆధ్వర్యంలో వీటిని నిర్వహించనున్నారు.

2030 నాటికి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాల్లో దాదాపు 20 లక్షల మంది నిపుణుల అవసరం ఉందని ప్రభుత్వం అంచనా. ఈ డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచి ఆయా రంగాల్లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. లైవ్ మ్యూజిక్ కచేరీల వల్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రానుంది. అలాగే హోటళ్లు, రవాణా రంగాల్లో భారీ డిమాండ్ పెరుగుతుంది.

ALSO READ: నిర్మల ప్రసంగం.. రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్, ఏపీకి ప్రయోజనాలు

అమెరికా, బ్రిటన్ మాదిరిగా భారత్‌లో కూడా విదేశీ కళాకారుల ప్రదర్శనను ప్రోత్సహించేందుకు వీసా అనుమతులను సులభతరం చేయనుంది. భారీ కచేరీ నిర్వహించాలంటే నిర్వాహకులు రకరకాల అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. వాటిని సమాచార మంత్రిత్వ శాఖ ద్వారా సింగిల్ విండో విధానాన్ని తీసుకురావాలన్నది కేంద్రం నిర్ణయం.

దీనివల్ల ఈవెంట్ ఆర్గనైజర్లకు పనులు మరింత తేలిక కానుంది. ఎకనామిక్ సర్వేలో దీనికి గురించి ప్రధానంగా పేర్కొంది కేంద్రం. దేశ జీడీపీలో 0.5 నుంచి 7 శాతం వాటాను కలిగి ఉందని అంచనా వేసింది. భారత్‌లో యువత ఎక్కువగా ఉండడంతో ఈ రంగం కేవలం వినోదానికే పరిమితం కాకుండా అటు అభివృద్ధి, ఇటు టూరిజానికి ఊతమిచ్చేలా భావిస్తోంది.

 

Related News

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

Big Stories

Advertisement
×