E-Paper
Advertisement

Corona Vaccine: కరోనాకు చుక్కల మందు.. అందుబాటులోకి ‘ఇన్‌కొవాక్‌’ నాసికా టీకా..

Corona Vaccine: కరోనాకు చుక్కల మందు.. అందుబాటులోకి ‘ఇన్‌కొవాక్‌’ నాసికా టీకా..
Advertisement

Corona Vaccine: కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ BF.7 ప్రమాదకరంగా మారుతోంది. వచ్చినవి 4 కేసులే అయినా.. ఆ వేరియంట్ తో ఉన్న ముప్పు వల్ల భారత ప్రభుత్వం హైఅలర్ట్ అయింది. రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. వ్యాక్సిన్లు, ఆక్సిజన్ పడకలు సిద్ధం చేసుకోమని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించడం తప్పనిసరి చేసింది. విమానాశ్రయాల్లో విదేశీ ప్రయాణీకులకు స్క్రీనింగ్ తప్పనిసరి చేసింది. క్రిస్మస్, న్యూ ఇయర్ ని దృష్టిలో ఉంచుకొని.. పెద్ద ప్రమాదమే పొంచిఉందని కేంద్రం భావిస్తోంది.

కరోనాను ఎదుర్కోగల ఏకైక ఆయుధం వ్యాక్సిన్ మాత్రమే. ఇప్పటికే కొవాగ్జిన్, కొవిషీల్డ్ లు అందుబాటులో ఉన్నాయి. రెండు డోసులు పూర్తైనా.. బూస్టర్ డోసులో మాత్రం బాగా వెనకబడి ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ బయోటెక్ తయారు చేసిన ‘రెండు చుక్కల నాసికా టీకా’కు కేంద్ర ఆరోగ్యశాఖ ఆమోదం తెలిపింది. నాసల్ వ్యాక్సిన్.. వెంటనే అందుబాటులోకి వచ్చింది. అయితే, ప్రస్తుతానికి ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ఇది లభ్యం కానుంది.

Advertisement

భారత్‌ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ చుక్కల మందు టీకా ‘ఇన్‌కొవాక్‌’ను బూస్టర్‌ డోసుగా వినియోగించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) నవంబర్‌లో అత్యవసర అనుమతి ఇచ్చింది. ఇప్పుడు దీనికి కేంద్రం ఆమోదం లభించడంతో.. శుక్రవారం సాయంత్రం నుంచి కొవిన్‌ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి రానుంది.

ఇప్పటికే కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు తీసుకున్నవారు ‘ఇన్‌కొవాక్‌’ నాసికా టీకాను హెటిరోలాగస్‌ బూస్టర్‌గా తీసుకోవచ్చు. 18 ఏళ్ల వయసు దాటిన వారు మాత్రమే ఈ నాసల్ వ్యాక్సిన్ వేసుకునేందుకు అనుమతి.

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×