E-Paper
Advertisement

Kaikala: అన్నయ్యను కోల్పోయా, చిరు కంటతడి.. అజాత శత్రువన్న పవన్..

Kaikala: అన్నయ్యను కోల్పోయా, చిరు కంటతడి.. అజాత శత్రువన్న పవన్..
Advertisement

Kaikala: కైకాల సత్యనారాయణ పార్థీవ దేహానికి చిరంజీవి నివాళి అర్పించారు. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి కైకాల ఇంటికి వెళ్లారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆయనతో జ్ఞాపకాలు గుర్తు చేసుకొని కంటతడి పెట్టారు.

ఆత్మీయంగా పిలిచే ఓ అన్నయ్యను కోల్పోయానని చిరంజీవి బాధ వ్యక్తం చేశారు. కైకాలతో నటించిన ప్రతీ సినిమా ఒక తీపి జ్ఞాపకం అన్నారు. విలక్షణ నటుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు చిరంజీవి.

Advertisement

కైకాల సత్యనారాయణ అజాత శత్రువు లాంటి వారిని పవన్ కల్యాణ్ అన్నారు. కైకాల లేని లోటు ఎవరూ పూడ్చలేరని త్రివిక్రమ్ చెప్పారు.

అంతకుముందు, సత్యనారాయణ మరణం పట్ల చిరంజీవి సంతాపం ప్రకటించారు. నటన, రుచికరమైన భోజనం.. ఈ రెండూ ఆయనకు ప్రాణమని చెప్పారు. వారి అనుబంధంపై సోషల్ మీడియాలో వివరంగా పోస్టు పెట్టారు చిరంజీవి.

Advertisement

చిరంజీవి, కైకాల. వయసులో చాలా బేధం ఉన్నా.. వారిద్దరి మధ్య మంచి అనుబంధమే ఉంది. చిరంజీవి హీరోగా నటించిన విజేత, కొండవీటి రాజా, మగధీరుడు, చక్రవర్తి, జేబుదొంగ, మంచిదొంగ, యముడికి మొగుడు, ఖైదీ నెంబర్ 786, రుద్రవీణ, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, స్టేట్‌ రౌడీ, కొదమసింహాం, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, మెకానిక్‌ అల్లుడు, బావగారు బాగున్నారా.. ఇలా అనేక సినిమాల్లో సత్యనారాయణ కీలక పాత్రల్లో నటించారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×