BigTV English

Kaikala Death: కైకాల-చిరు.. వారి అనుబంధం అపురూపం..

Kaikala Death: కైకాల-చిరు.. వారి అనుబంధం అపురూపం..

Kaikala Death: జులై 25, 2022. కైకాల సత్యనారాయణ పుట్టినరోజు. అప్పటికే ఆయన అనారోగ్యంతో ఉన్నారు. వృద్ధాప్యం మీదపడింది. మంచం మీదనే ఉంటున్నారు. అలాంటి ఆయన 86వ బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కైకాల ఇంటికి వెళ్లారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. కేక్ కట్ చేయించారు. ఆప్యాయం మాట్లాడారు. అంతా కలిసి కాసేపు కులాసాగా గడిపారు. జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. కైకాల సత్యనారాయణ మరణంతో ఆనాటి సంగతులు.. కైకాలతో కలిసి చేసిన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు చిరంజీవి.


చిరంజీవి, కైకాల. వయసులో చాలా బేధం ఉన్నా.. వారిద్దరి మధ్య మంచి అనుబంధమే ఉంది. చిరంజీవి హీరోగా నటించిన విజేత, కొండవీటి రాజా, మగధీరుడు, చక్రవర్తి, జేబుదొంగ, మంచిదొంగ, యముడికి మొగుడు, ఖైదీ నెంబర్ 786, రుద్రవీణ, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, స్టేట్‌ రౌడీ, కొదమసింహాం, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, మెకానిక్‌ అల్లుడు, బావగారు బాగున్నారా.. ఇలా అనేక సినిమాల్లో సత్యనారాయణ కీలక పాత్రల్లో నటించారు. వారి కాంబినేషన్.. నువ్వా, నేనా అన్నట్టు సాగేది.

సత్యనారాయణ మరణం పట్ల చిరంజీవి సంతాపం ప్రకటించారు. నటన, రుచికరమైన భోజనం.. ఈ రెండూ ఆయనకు ప్రాణమని చెప్పారు. వారి అనుబంధంపై సోషల్ మీడియాలో వివరంగా పోస్టు పెట్టారు చిరంజీవి.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×