E-Paper
Advertisement

New Rental Act 2026: కొత్త అద్దె చట్టం.. అద్దెదారులకు భారీ ఊరట.. ఇకపై అగ్రిమెంట్ తప్పనిసరి

New Rental Act 2026: కొత్త అద్దె చట్టం.. అద్దెదారులకు భారీ ఊరట.. ఇకపై అగ్రిమెంట్ తప్పనిసరి
Advertisement

New Rental Act 2026: కొత్త అద్దె చట్టం 2026 గేమ్ ఛేంజర్‌ కానున్నాయి. ఈ నిబంధనల్లో డిజిటల్ రిజిస్ట్రేషన్‌కు అతిపెద్ద మార్పు కానుంది. అయితే చట్టపరమైన రక్షణను పొందాలంటే 60 రోజుల్లోపు అద్దె ఒప్పందాన్ని రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. రెంటల్ సెక్యూరిటీ డిపాజిట్లను కేవలం 2 నెలలకు మాత్రమే పరిమితం చేసింది కేంద్రం. అలాగే ఇంటి ఓనర్ ఇల్లు చూడడానికి వచ్చే ముందు 24 గంటల ముందు తెలియజేయాలి. అలాగే అద్దె పెంపునకు 90 రోజుల ముందు తెలియజేయాల్సి ఉంటుంది. దేశంలో కొత్త అద్దె చట్టం 2026 అమల్లోకి వచ్చింది. కొత్త చట్టంలో అద్దెదారులకు భారీ ఊరట లభిస్తుంది.

అగ్రిమెంట్ తప్పనిసరి

రెంట్ కు తీసుకునే ముందు తప్పనిసరిగా లిఖితపూర్వకంగా ఒప్పందాలు చేసుకోవాలి. మౌఖిక ఒప్పందాలు లేదా హ్యాండ్‌షేక్ ఒప్పందాలు ఇకపై చట్టబద్ధంగా చెల్లుబాటు కావు. ప్రతి అద్దెంటికి రాతపూర్వక అగ్రిమెంట్ చేసుకోవాలి. ఇరు పార్టీలు అద్దె అథారిటీకి అగ్రిమెంట్ విషయాన్ని తెలియజేయాలి. ఒప్పందంపై సంతకం చేసిన 60 రోజుల్లోపు ఆ ఒప్పందాన్ని రిజిస్టర్ చేసుకోవాలి.
ఈ అద్దె ఒప్పందాలు కోర్టులో ఆమోదయోగ్యంగా ఉండాలంటే వాటిని డిజిటల్‌గా స్టాంప్ చేసి, రాష్ట్ర సంబంధిత పోర్టల్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ తర్వాత, భవిష్యత్తులో వచ్చే వివాద పరిష్కారాల కోసం ప్రత్యేక ఐడీని పొందాలి.

సెక్యూరిటీ డిపాజిట్

Advertisement

అద్దె తీసుకునేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ లు గరిష్టంగా 2 నెలలకు మాత్రమే పరిమితం చేశారు. కమర్షియల్/నివాసేతర గృహాలకు గరిష్టంగా 6 నెలల అద్దెను సెక్యూరిటీ డిపాజిట్ గా తీసుకోవచ్చు. ఒకవేళ ఇల్లు ఖాళీ చేస్తే.. సాధారణ ఖర్చులు మినహా ఇతర డిపాజిట్‌ అమౌంట్ ను టెనెంట్ కు తిరిగి చెల్లించాలి.

అద్దె పెంపు

అద్దెను 12 నెలలకు ఒకసారి మాత్రమే పెంచాలి. అగ్రిమెంట్ లో అద్దె పెంపుపై చెప్పకపోతే.. అద్దె పెంపును అమలు చేయడానికి ముందు ఇంటి యజమానులు 90 రోజుల ముందు రాతపూర్వక నోటీసును అందించాలి. ఇంటి యజమాని ఇంటిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోకపోతే మధ్యంతర హైకింగ్ రద్దు అవుతుంది.

సెక్యూరిటీ

Advertisement

ఇంటి యజమానులు 24 గంటల రాతపూర్వక లేదా ఎలక్ట్రానిక్ నోటీసు ఇవ్వకుండా అద్దె ఇంట్లోకి ప్రవేశించకూడదు. తనిఖీలు, మరమ్మతులు పగటిపూట మాత్రమే నిర్వహించాలి. అగ్నిప్రమాదం, వరదలు లేదా ప్రకృతి వైపరీత్యాలు వంటి అత్యవసర సందర్భాల్లో నోటీసు అవసరం లేదు.

మరమ్మతులు

ఇంటి నిర్మాణ మరమ్మతులు, పెయింటింగ్, విద్యుత్ వైరింగ్, ప్లంబింగ్ పైపు పనులను ఇంటి యాజమాని చేయించాల్సి ఉంటుంది. రోజువారీ నిర్వహణ, చిన్న మరమ్మతులు (కుళాయిలు, స్విచ్‌లు, సాకెట్లు), డ్రెయిన్ క్లీన్ వంటివి అద్దెదారుడు భరించాల్సి ఉంటుంది. అద్దెదారుడు నోటీసు ఇచ్చిన 30 రోజులలోపు ఇంటి యజమాని అవసరమైన నిర్మాణ మరమ్మతులను చేయింటడంతో విఫలమైతే , అద్దెదారుడు మరమ్మత్తులు చేసి ఆ మొత్తాన్ని అద్దె నుంచి మినహాయించవచ్చు.

Also Read : హర్మూజ్ జలసంధి మూసే ఉండాలి.. ప్రతి ప్రాణానికి ప్రతీకారం.. ఇరాన్ కొత్త సుప్రీం వార్నింగ్

గడువు దాటిన తర్వాత

రెండు నెలలు అద్దె చెల్లించకపోవడం, ఆస్తి నష్టానికి కారణమైతే అద్దె ట్రిబ్యునళ్ల ద్వారా రెంట్ కు ఉన్న వారిని ఖాళీ చేయించడానికి అవకాశం ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత అద్దెదారుడు ఖాళీ చేయడానికి జరిమానాలు విధించవచ్చు. ప్రత్యేక కోర్టులలో రెంటల్ వివాదాల కేసుల విచారణ చేపట్టనున్నారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×