E-Paper
Advertisement

Iran Mojtaba Khamenei: హర్మూజ్ జలసంధి మూసే ఉండాలి.. ప్రతి ప్రాణానికి ప్రతీకారం.. ఇరాన్ కొత్త సుప్రీం వార్నింగ్

Iran Mojtaba Khamenei: హర్మూజ్ జలసంధి మూసే ఉండాలి.. ప్రతి ప్రాణానికి ప్రతీకారం.. ఇరాన్ కొత్త సుప్రీం వార్నింగ్
Advertisement

Iran Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొజ్తాబా ఖమేనీ తొలిసారి స్పందించారు. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌లకు సంబంధించిన వివాదం.. ఇప్పుడు పశ్చిమాసియా మొత్తం తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా వ్యూహాత్మక పాయింట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ఖమేనీ తెలిపారు.

హర్మూజ్ జలసంధి మూసే ఉంటుంది

ప్రపంచ దేశాలపై ఒత్తిడిని పెంచే విధంగా హర్మూజ్ జలసంధిని మూసే ఉంచుతామని మొజ్తాబా ఖమేనీ తెలిపారు. ఇరుకైన ఈ జలమార్గం ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాలలో ఒకటి. ఇలాంటి సమయంలో హర్మూజ్ మూసివేతను కొనసాగించడం.. తమ లక్ష్యాలను చేరుకునే మార్గంగా ఇరాన్ నాయకుడు తెలిపారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొదటి సందేశంలో ఇరాన్ అమరవీరుల ఆత్మ శాంతించేలా ప్రతీకారం తీర్చుకుంటామని, జలసంధిని మూసివేస్తామని అన్నారు.

యూఎస్ స్థావరాల మూసివేత

Advertisement

గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను మూసివేయాలని లేదంటే వాటిపై నిరంతరం దాడి చేస్తామని ఖమేనీ హెచ్చరించారు. అమెరికా దళాలకు స్థావరాలు కల్పించిన గల్ఫ్ అరబ్ దేశాలు వెంటనే ఆ స్థావరాలను మూసివేయాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా వాగ్దానం చేసిన రక్షణ అబద్ధం తప్ప మరేం కాదని అన్నారు. రుగు దేశాలపై దాడులు కొనసాగుతాయని ఇరాన్ తన వైఖరిని స్పష్టం చేసింది.

ప్రతీకారం తప్పదు

ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ నాయకుడు ఖమేనీ హెచ్చరించారు. శత్రువుల ఆస్తులను భారీ స్థాయిలో నాశనం చేస్తామని అన్నారు. యుద్ధంలో నష్టపోయిన వారిని ఆదుకుంటామన్నారు. వైద్య చికిత్స ఉచితంగా అందిస్తామన్నారు. తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత సుప్రీం నాయకుడిగా ఎన్నికైన మొజ్తాబా ఖమేనీ తొలిసారి బహిరంగ ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఆయన కెమెరా ముందు కనిపించలేదు. యుద్ధం ప్రారంభంలో తాము చేసిన దాడిలో అతను గాయపడి ఉండవచ్చని ఇజ్రాయెల్ అంచనా వేస్తుంది. మినాబ్ పాఠశాలపై దాడిలో మరణించిన పిల్లలతో సహా యుద్ధంలో మరణించిన ప్రతి ఒక్క ప్రాణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఖమేనీ ప్రతిజ్ఞ చేశారు.

Advertisement

Also Read: దౌత్యం ఫలించింది.. ఇరాన్ గ్రీన్‌ సిగ్నల్, ఇండియా షిప్‌లకు అనుమతి

యుద్ధం తీవ్రం చేస్తాం

గల్ఫ్‌లోని ఇంధన మార్గాలను మూసివేయడంతో.. అమెరికాపై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగా హర్మూజ్ జలసంధి, బాస్రా నౌకాశ్రయంలోని నౌకలపై ఇరాన్ దాడులు చేస్తుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ముడి చమురు బ్యారెల్‌కు 100 డాలర్ల కంటే ఎక్కువగా పెరడంతో.. గల్ఫ్ లో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Related News

చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

Big Stories

Advertisement
×