E-Paper
Advertisement

Family Drama OTT: ముగ్గురు తండ్రులకు పుట్టిన ముద్దుల కూతురు… ఆసక్తి రేపుతున్న ఒక్కో ఎపిసోడ్

Family Drama OTT: ముగ్గురు తండ్రులకు పుట్టిన ముద్దుల కూతురు… ఆసక్తి రేపుతున్న ఒక్కో ఎపిసోడ్
Advertisement

Family Drama OTT : ఓటీటీలో ఒక కొరియన్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది చాలా సుదీర్ఘమైన వెబ్ సిరీస్ కూడా. దాదాపు 120 ఎపిసోడ్లతో ఈ సిరీస్ నడుస్తోంది. కొరియన్ ఫ్యాన్స్ సిరీస్ ను చివరి వరకు చూడగలిగితే మాత్రం గొప్ప విషయమే. అయితే ఈ సిరీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తండ్రి ఎవరో తెలియని ఒక అమ్మాయి, తన తండ్రి కోసం తపన పడే తీరు ఆకట్టుకుంటుంది. మరి ఈ సిరీస్ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ సౌత్ కొరియన్ డ్రామా పేరు ‘మారి అండ్ హర్ త్రీ డాడీస్’ (Marie and Her Three Daddies). 2025 అక్టోబర్ 13 నుండి KBS1 ఛానెల్‌లో ప్రసారమవుతున్న ఒక పాపులర్ సిరీస్ ఇది. హా సీంగ్-రి, హ్యున్ వూ, పార్క్ యున్-హై ఇందులో లీడ్ రోల్స్ లో నటించారు. మొత్తం 120 ఎపిసోడ్లతో ప్రతి ఎపిసోడ్ సుమారు 35 నిమిషాలు ఉంటుంది. ఈ డ్రామా ప్రస్తుతం Prime Video, Apple TV ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే 

Advertisement

ఈ కథలో మెయిన్ క్యారెక్టర్ పేరు కాంగ్ మారి. ఈ పిల్ల పుట్టినప్పటి నుంచే తన అసలు తండ్రి ఎవరో తెలియక పిచ్చిగా వెతుకుతూ ఉంటుంది. దీనికి తోడు వాళ్ళ అమ్మ ‘జూ సి-రా’ చాలా కోపిష్టి, ఏదైనా అంటే చాలు చిందులు తొక్కుతుంది. అసలు తండ్రి ఎవరో చెప్పకుండా ఊరిస్తూ ఉంటుంది. ఈ లోపు మారి తన ఆఫీసులో జూనియర్ డాక్టర్‌గా పని చేసే ‘లీ గాంగ్-సే’ అనే కుర్రాడితో లవ్‌లో పడుతుంది. కథలో ఇప్పుడు అసలైన ట్విస్ట్ వస్తుంది. సడన్‌గా మారి జీవితంలోకి ముగ్గురు మనుషులు ఎంట్రీ ఇస్తారు. ఇక్కడే అసలు ట్విస్ట్ వస్తుంది.

వీళ్ళంతా మేమే తండ్రులమని ఆమె వెంట పడతారు. ఈ ముగ్గురిలో ఎవడు అసలు తండ్రి? ఎవరికీ క్లారిటీ ఉండదు. వీళ్ళ ముగ్గురి మధ్య జరిగే రచ్చ, ఆ తండ్రి ఎవరో తేల్చుకోవడానికి పడే పాట్లు భలే కామెడీగా ఉంటాయి. చివరికి ఈ కథలో మారి తండ్రి ఎవరు ? ఆమె అతన్ని కనిపెడుతుందా ? ఈ గందరగోళంలో తన లవ్‌ని ఎలా గెలిపించుకుంది ? అనే అంశాలతో 120 ఎపిసోడ్ల ఈ డ్రామా ఫుల్ ఎంటర్టైన్‌మెంట్‌తో సాగుతుంది.

Advertisement

Read Also :  ఆత్మలతో మాట్లాడే డాక్టర్ … ఓటీటీలోకి రాబోతున్న సౌత్ కొరియన్ మెడికల్ థ్రిల్లర్ సిరీస్

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×