TamilNadu Politics: తమిళనాడుకు సీఎం అయ్యే అదృష్టం విజయ్‌కు లేదా? ఆ ఘడియలు ఇంకా రాలేదా? అందుకు కొన్నాళ్లు సమయం పట్టవచ్చా? విజయ్‌కు గ్రహాలు అనుకూలంగా లేవా? ప్రభుత్వం ఏర్పాటుపై గురువారం గవర్నర్ ఏమన్నారు? మీడియా వార్తల నేపథ్యంలో గవర్నర్ ఆఫీస్ అలర్ట్ అయ్యిందా? విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ నిరాకరించారా? అవుననే అంటున్నాయి గవర్నర్ ఆఫీసు వర్గాలు. దీంతో తమిళనాడు కొత్త ప్రభుత్వం వ్యవహారం మొదటికి వచ్చినట్లయ్యింది.
తమిళనాడు రాజకీయాల్లో అదే సీన్ రిపీట్
తమిళనాడులో టీవీకే చీఫ్ అధినేత విజయ్‌కు గ్రహాలు అనుకూలించలేనట్టు కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని రెండుసార్లు గవర్నర్ వద్దకు వెళ్లారు. ఆయన ఎలాంటి మార్పులేదు. సంఖ్యా బలాన్ని చూపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్‌కు గవర్నర్ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ఓ లేఖ విడుదల చేసింది.
గురువారం ఉదయం మరోసారి టీవీకే చీఫ్ విజయ్.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌తో సమావేశమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య ఉందని, ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. దానిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేయలేదు.
విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నో పర్మిషన్
మీడియాలో మాత్రం విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చారంటూ టీవీల్లో పెద్ద పెద్ద బ్రేకింగ్ న్యూస్. చివరకు నేషనల్ మీడియాలో కూడా ఈ తరహా వార్తలు వచ్చాయి. పరిస్థితి గమనించిన తమిళనాడు గవర్నర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నిరాకరించినట్టు అందులో ప్రస్తావించింది.
మెజార్టీ సంఖ్యా బలాన్ని చూపించాలని విజయ్‌ను గవర్నర్ కోరారు. టీవీకే పార్టీకి మద్దతిస్తామని వీసీకే, సీపీఐ సానుకూలంగా స్పందించినా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తమిళనాడులో జరుగుతున్న పరిణామాలపై సినీ, సామాన్యులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
ALSO READ: తమిళనాడులో రాజకీయ ఉత్కంఠ.. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై కమల్ హాసన్ ఫైర్!
మెజార్టీని నిరూపించుకోవాల్సి రాజ్‌భవన్‌లో కాదని, అసెంబ్లీలోనని అన్నారు ఎంపీ కమల్ హాసన్. ఇదే విషయాన్ని ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో తమిళనాడు గవర్నర్ ప్రవర్తన అత్యంత అసహ్యకరంగా ఉందని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. గవర్నర్ రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం విజయ్‌కు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు గవర్నర్‌పై ఒత్తిడి తెస్తున్నారేమోనని అనుమానం ప్రజలకు కలుగుతోందని తమిళనాడు యూత్ కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. గవర్నర్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని కోరింది. ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను ఆహ్వానించకపోతే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించింది.
అధికారిక ప్రకటన విడుదల చేసిన తమిళనాడు గవర్నర్ ఆఫీస్
తమిళనాడులో TVK ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నిరాకరణ
సంఖ్యా బలాన్ని చూపించాలని విజయ్‌ను కోరిన గవర్నర్
Governor rejects TVK government formation in Tamil Nadu.. Tamil Nadu Governor's Office issued the official announcement https://t.co/9WpuQdSYCd pic.twitter.com/M5AOlTthG6
— BIG TV Breaking News (@bigtvtelugu) May 7, 2026