Peddi Movie: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం పెద్ది. ఈ సినిమా ఏప్రిల్ 31 తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా సినిమా షూటింగ్ పూర్తి కానీ నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తోంది.. ఈ సినిమా జూన్ 4వ తేదీ విడుదల కాబోతున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా కొత్త తేదీని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే సినిమా పనులను కూడా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఎడిటింగ్ పనులను ప్రారంభించారు. తాజాగా ఎడిటింగ్ పనులను కూడా పూర్తి చేసినట్లు చిత్ర బృందం వెల్లడించారు.
ఈ సినిమా ఎడిటింగ్ పనులు పూర్తి కావడంతో ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. జూన్ 4వ తేదీ పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో జూన్ 3 నుంచి ప్రీమియర్లను ప్రసారం చేయబోతున్నారు. సాధారణంగా ప్రీమియర్లు అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే మేకర్స్ ప్రీమియర్లను ప్రసారం చేసేవారు కానీ పెద్ది సినిమా విషయంలో మాత్రం నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీమియర్లు భారీ స్థాయిలో మూడవ తేదీనే ప్రసారం కాబోతున్నట్లు చిత్ర నిర్మాతలు తెలియజేశారు.
ఇలా మూడవ తేదీ నుంచి పేరు ప్రీమియర్లు ప్రసారం కాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా మెగా అభిమానులు పెద్ది సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ RRR సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన మరో రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో చరణ్ అభిమానులు ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
The #PEDDI Edit has been locked🔒
All set and ready for massive premieres from JUNE 3rd 2026💥💥💥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON June 4th ❤🔥#GetReadyForPeddi 💥💥
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/e240haEItl
— Vriddhi Cinemas (@vriddhicinemas) May 7, 2026
బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమాను ప్రకటించడంతో అభిమానుల ఆశలన్నీ కూడా ఈ సినిమాపైనే ఉన్నాయి. ఇక ఈ సినిమా గ్రామీణ క్రీడా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో రామ్ చరణ్ మూడు విభిన్నమైనటువంటి పాత్రలలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక పాత్ర క్రికెట్ నేపథ్యంలో ఉండబోతుందని, మరొకటి కుస్తీ పోటీల నేపథ్యంలో ఉండబోతోందని తెలుస్తుంది. ఇక మూడో పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని ఈ రోల్ థియేటర్లోనే ప్రేక్షకులకు సర్ప్రైజ్ గా రివీల్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ఇప్పటివరకు పెద్ది సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. మరి జూన్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పెద్ది ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించబోతున్నారనేది తెలియాల్సి ఉంది.
Also Read: ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘తిమ్మరాజు పల్లి టీవీ’..స్ట్రీమింగ్ ఎక్కడంటే?