E-Paper
Advertisement

బీటెక్‌ అర్హతతో ఉద్యోగాలు.. రూ.1,80,000 వరకు జీతం, APPLY NOW

బీటెక్‌ అర్హతతో ఉద్యోగాలు.. రూ.1,80,000 వరకు జీతం, APPLY NOW
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కోల్‌కతాలోని భారత ప్రభుత్వ మహారత్న రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) నిరుద్యోగులకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మైనింగ్ విభాగంలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. గేట్-2025 స్కోర్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. మొత్తం 276 ఖాళీలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ రంగ సంస్థలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.

మొత్తం పోస్టుల సంఖ్య: 276

Advertisement

మొత్తం 276 పోస్టులలో రిజర్వేషన్ల వారీగా వర్గీకరణ చూస్తే అన్‌రిజర్వ్‌డ్ (UG) కేటగిరీకి 114 స్థానాలు కేటాయించారు. ఓబీసీ అభ్యర్థులకు 74 పోస్టులు ఉన్నాయి. ఎస్సీలకు 41 అలాగే ఎస్టీలకు 20 పోస్టులు కేటాయించబడ్డాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) అభ్యర్థుల కోసం 27 పోస్టులు సిద్ధంగా ఉన్నాయి.

విద్యార్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మైనింగ్ ఇంజినీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనరల్ సహా ఓబీసీ వర్గాల అభ్యర్థులకు డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు ఉండటం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రం 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. విద్యాార్హతలతో పాటు తప్పనిసరిగా గేట్-2025 పరీక్షలో అర్హత సాధించి మంచి స్కోర్ కలిగి ఉండాలి.

Advertisement

వయస్సు: వయో పరిమితి విషయానికి వస్తే ఏప్రిల్ 30 నాటికి అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు మూడు ఏళ్లు అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయో సడలింపు వర్తిస్తుంది.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు వేతనం కూడా అత్యంత ఆకర్షణీయంగా ఉండనుంది. శిక్షణ కాలంలో నెలకు రూ. 60,000 బేసిక్ పే ఉంటుంది. మొత్తం పే-స్కేల్ నెలకు రూ. 60,000 నుంచి రూ. 1,80,000 వరకు ఉండే అవకాశం ఉంది. ఇతర భత్యాలు కూడా సంస్థ నిబంధనల మేరకు అందుతాయి.

సెలెక్షన్ ప్రాసెస్: ఎంపిక ప్రక్రియ పూర్తిగా గేట్-2025 స్కోర్ ఆధారంగానే జరుగుతుంది. వచ్చిన దరఖాస్తులను స్కోర్ ప్రాతిపదికన షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు తదుపరి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) నిర్వహిస్తారు. అనంతరం మెడికల్ ఎగ్జామినేషన్ (IME) పూర్తయ్యాక తుది నియామక ఉత్తర్వులు అందజేస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్ అలాగే ఓబీసీ అభ్యర్థులకు రూ. 1,180 గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు కోల్ ఇండియాలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

చివరి తేది: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 8వ తేదీన ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూన్ 7 వరకు గడువు ఇచ్చారు.

అభ్యర్థులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న పూర్తి నోటిఫికేషన్ చదివి వివరాలను సరిచూసుకోవాలి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న కోల్ ఇండియా ప్రాజెక్టులలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

ALSO READ: 74 ఏళ్ల నాటి వివాదానికి ముగింపు.. ఆ 600 ఎకరాల భూమి అటవీశాఖదే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×