E-Paper
Advertisement

PM SYM Scheme: కార్మికులు, చిరువ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్.. రూ.55 ప్రీమియంతో రూ. 3 వేల పెన్షన్

PM SYM Scheme: కార్మికులు, చిరువ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్.. రూ.55 ప్రీమియంతో రూ. 3 వేల పెన్షన్
Advertisement

PM SYM Scheme: కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ (PM SYM), లఘువ్యాపారి మాన్ ధన్ (PM-NPS Traders) పెన్షన్ పథకాల 60 ఏళ్ల దాటిన వారికి రూ.3000 పెన్షన్ అందించనున్నారు. ఈ పెన్షన్ పథకాలలో చేరేందుకు మొదట విడతగా జనవరి 15, 2026 నుండి ఫిబ్రవరి 15, 2026 వరకు పట్టణ ప్రాంతాలలో నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. 2వ విడతలో ఫిబ్రవరి 16, 2026 నుండి మార్చి 15, 2026 వరకు గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేయనున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ)లలో క్యాంపులు నిర్వహించనున్నారు.

పీఎం శ్రమయోగి మాన్ ధన్ యోజన అర్హతలు

1.ఈ పెన్షన్ స్కీమ్ కు వీధులలో బండ్లపై అమ్ముకునేవారు, రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, రోజు వారీ కూలీలు, బీడీ కార్మికులు, ఇటుక బట్టీ పనివారు, చేనేత కార్మికులు, చర్మకారులు, ఇండ్లలో పనిచేసేవారు.. అసంఘటిత కార్మికులందరూ అర్హులే.

Advertisement

2. నెలసరి ఆదాయం రూ. 15000 లోపు కలిగి ఉన్న వారందరూ అర్హులు

3. వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి.

Advertisement

4. ఈ.ఎస్.ఐ. ఈపీఎఫ్ సదుపాయం లేనివారు ఈ పథకానికి అర్హులు.

ప్రధానమంత్రి లఘువ్యాపారి మాన్ ధన్ పథకం- అర్హతలు

1. ఈ పింఛన్ పథకానికి స్వయం ఉపాధి కార్మికులు, చిరు వ్యాపారులు, రిటైల్ వ్యాపారులు, రైస్ మిల్ యాజమాన్యాలు, ఆయిల్ మిల్ యాజమాన్యాలు, వర్క్ షాప్ యాజమాన్యాలు, కమీషన్ ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్, చిన్న హోటల్స్ యజమానులు, రెస్టారెంట్స్ వంటి ఇతర చిన్న వ్యాపారులు అర్హులు.

2. ఆదాయపు పన్ను చెల్లించని వారు, వార్షిక టర్నోవర్ రూ.1.50 కోట్ల ఉన్న వారు అర్హులు

3. 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు

4. ఈ. ఎస్.ఐ, ఈపీఎఫ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ లో లేనివారు అర్హులు

అమలు విధానం

1. ఈ పథకాలను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ద్వారా అమలు చేస్తారు. లబ్దిదారులు చెల్లించే పెన్షన్లకు ఎల్ఐసీ పూర్తి బాధ్యత వహిస్తుంది.
2. లబ్దిదారుని బ్యాంక్ అకౌంట్ నుంచి ఎల్ఐసీకి నేరుగా ప్రతి నెలా ప్రీమియం చెల్లించే సదుపాయం ఉంది. దీనికి బ్యాంకు వారికి అంగీకార పత్రం సమర్పించాలి.
3. లబ్దిదారులు ప్రతి నెలా చెల్లించే ప్రీమియం వివరాలు, అకౌంట్లో జమ చేసే వివరాలు ఎప్పటికప్పుడు మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

దరఖాస్తు విధానం

1. మీ దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
2. ఈ పథకంలో నమోదు చేసుకున్న అభ్యర్థులు ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ జిరాక్స్, ప్రస్తుతం వాడుతున్న సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
3. ఈ పథకంలో చేరాలనుకునేవాళ్లు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు, వారి వయస్సులను బట్టి ప్రీమియం చెల్లించాలి.

Also Read: కుటుంబం మొత్తానికి ఫ్రీగా రూ.5 లక్షల ఆరోగ్య బీమా.. కేంద్ర ప్రభుత్వ సూపర్ స్కీమ్

ఈ పథకాలతో ప్రయోజనాలు

1. పీఎం మాన్ ధన్ పథకాలలో చేరిన వారికి 60 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి నెలా రూ.3000 చొప్పున పెన్షన్ లభిస్తుంది.
2. ఈ స్కీమ్ లబ్దిదారులు చెల్లించే ప్రీమియంకు సమానంగా కేంద్రం మొత్తాన్ని పింఛన్ నిధికి జమ చేస్తుంది.
3. మరణానంతరం జీవిత భాగస్వామికి 50% మొత్తం చెల్లిస్తారు.
4. ఈ స్కీమ్ లో చేరిన అనంతరం పదేళ్లు లోపు వైదొలగాలనుకుంటే మీరు కట్టిన డబ్బులను సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వడ్డీ రేటుతో తిరిగి చెల్లిస్తారు. పదేళ్ల తరువాత వైదొలిగితే పింఛన్ ఫండ్ లో పొందిన వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారు. ప్రతి నెల ప్రీమియం చెల్లిస్తూ మధ్యలో మరణం సంభవిస్తే.. అతడికి బదులుగా వారి జీవిత భాగస్వామి ఈ పథకంలో సభ్యులుగా కొనసాగవచ్చు. వారికి కూడా పూర్తి పింఛన్ లభిస్తుంది.
5. ఒకవేళ జీవితభాగస్వామి మృతి చెందిన తర్వాత ఈ స్కీమ్ ను ఆపేయాలని భావిస్తే మీరు కట్టిన మొత్తం డబ్బులను వడ్డీతో సహా చెల్లిస్తారు.

 

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×