E-Paper
Advertisement

CM Chandrababu Naidu: బాత్రూం రసాయనాలతో స్వామివారి లడ్డూ నెయ్యి తయారీ?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

CM Chandrababu Naidu: బాత్రూం రసాయనాలతో స్వామివారి లడ్డూ నెయ్యి తయారీ?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
Advertisement

CM Chandrababu Naidu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మిగనూరు నియోజకవర్గం కలుగొట్లలో నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో రైతు సంక్షేమం, భూ హక్కుల రక్షణపై కీలక ప్రసంగం చేశారు. కరోనా కష్టకాలంలో అందరూ ఇళ్లకే పరిమితమైనా, రైతులు మాత్రం విరామం లేకుండా కష్టపడి దేశానికి అన్నం పెట్టారని ఆయన కొనియాడారు. రాష్ట్రం వ్యవసాయ ఆధారితమైనది కావడంతో, సాగును లాభసాటిగా మార్చడమే తన లక్ష్యమని తెలిపారు. కర్నూలు జిల్లాలోని పశ్చిమ తాలూకాలతో సహా ప్రతి ఎకరాకు నీళ్లు అందించడమే తన జీవితాశయమని, రాయలసీమను ‘రత్నాల సీమ’గా మార్చేందుకు నదుల అనుసంధానం చేపడతామని భరోసా ఇచ్చారు.

భూముల రక్షణ విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతులను బానిసలుగా మార్చాలని చూశారని, సర్వే రాళ్ల పేరుతో రూ. 700 కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలస్ సమీపంలో హెలిప్యాడ్ కోసం ప్రైవేట్ భూములను బలవంతంగా ప్రభుత్వ భూములుగా మార్చిన ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు. భూ రికార్డులను అస్తవ్యస్తం చేయడం వల్ల వందలాది మంది ప్రజలు భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇన్ని భూ సమస్యలు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

ఈ సమస్యల పరిష్కారానికి అత్యాధునిక సాంకేతికతతో కూడిన రాజముద్ర ఉన్న పట్టాదారు పాస్‌పుస్తకాలను ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ కొత్త పాస్‌పుస్తకాల్లో క్యూఆర్ (QR) కోడ్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయని, వీటిని ఎవరూ ట్యాంపర్ చేయలేరని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా రికార్డులను మార్చాలని చూస్తే వారికి పిడీ (PD) యాక్ట్ కింద జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 37,40,000 పాస్‌పుస్తకాలు సిద్ధం కాగా, 19 లక్షల పుస్తకాలను పంపిణీ చేశామని, మిగిలిన వాటిని ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.

రైతులపై ఆర్థిక భారం తగ్గించేందుకు వారసత్వ ఆస్తి బదిలీ ప్రక్రియను కేవలం రూ. 100 లకే అందుబాటులోకి తెచ్చామని చంద్రబాబు గారు పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో కూడా విద్యుత్ చార్జీలు పెంచబోమని రైతులకు హామీ ఇచ్చారు. ఉద్యానవన పంటల సాగులో రాయలసీమ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, ఓర్వకల్లు వంటి ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. చివరగా, భూముల విషయంలో బంధుమిత్రులు గొడవలు పడి ప్రాణాలు తీసుకోవద్దని, ఉదారంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై గత ప్రభుత్వంపై ముఖ్యమంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల పాలనలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టను దెబ్బతీసేలా అపవిత్ర పనులు చేశారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం తయారీలో రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యిని వాడటం అత్యంత దారుణమని ఆయన పేర్కొన్నారు.

ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి నాణ్యతపై వివరిస్తూ, బాత్రూంలను శుభ్రపరిచేందుకు ఉపయోగించే ప్రమాదకరమైన రసాయనాలతో ఆ నెయ్యిని తయారు చేయించారని ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల పాటు ఇలాంటి కల్తీ నెయ్యితోనే స్వామివారి లడ్డూలను తయారు చేయించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆయన మండిపడ్డారు.

ఈ వ్యవహారంలో గత ప్రభుత్వ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు గారు విమర్శించారు. నెయ్యి కల్తీ కాలేదని సీబీఐ (CBI) లేదా సిట్ (SIT) క్లీన్ చిట్ ఇచ్చాయని వారు మాట్లాడుతున్నారని, కానీ వాస్తవానికి వారి కుటుంబ సభ్యులే కల్తీ జరిగిందని ఒప్పుకున్నారని గుర్తు చేశారు. గత టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి గారే స్వయంగా కల్తీ జరిగిందని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు.

Read Also: Arava Sridhar MLA: గంటకో వీడియో.. ఎమ్మెల్యేకు ముచ్చెమటలు.. వెలుగులోకి మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ చాటింగ్స్

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×