BRS Party: మాజీ మంత్రులకు గులాబీ అధిష్టానం టాస్క్ అప్పగించింది. మున్సిపాలిటీల్లోపార్టీని గెలిపించుకోవాల్సిందేనని ఆదేశాలు ఇచ్చింది. ఉమ్మడి జిల్లాల్లో అన్నిమున్సిపాలిటీల సమన్వయ బాధ్యతలను ఇచ్చింది. అయితే వారు ఎలా ముందుకు వెళ్తారు.. పార్టీ అభ్యర్థులను ఎలా విజయతీరాలను చేర్చుతారనేది ఇప్పుడు పార్టీలోనే చర్చకుదారితీసింది. పార్టీ సైతం మాజీ మంత్రుల పనితీరుపైన దృష్టిసారించింది. మున్సిపాలిటీల్లో వారు చేసే ప్రచారసరళిపైనా ఆరా తీస్తున్నట్లు సమాచారం. కేటీఆర్, హరీష్ రావు లు వారివారి ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం స్పీడ్ పెంచారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలకు మంత్రులకే ఇన్ చార్జీ బాధ్యతలను అప్పగించింది. పార్టీకి జిల్లా అధ్యక్షులను నియమించినా ఇన్ చార్జులకే కీలక పాత్రపోషించారు. వారు చెప్పిన అంశాలనే పార్టీ సైతం పరిగణలోకి తీసుకుంది. అయితే ఇప్పటికీ వారే జిల్లాల్లో కింగ్ మేకర్లు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వారే హవా కొనసాగిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని గులాబీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది.
ఉమ్మడి జిల్లాల్లోని మున్సిపాలిటీలను గెలిపించుకోవాల్సిన బాధ్యతను అప్పగించినట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అయితే ఇప్పుడు వారికి అసలు టాస్క్ మొదలైంది. ఇప్పటి వరకు వారే జిల్లాల్లో ఆధిపత్యం చెలాయించడంతో పాటు పార్టీ అధిష్టానంతోనూ నిత్యం భేటీలు అవుతున్నారు. పార్టీ పై ప్రజల్లో ఉన్న ఫీడ్ బ్యాక్ కు ఇస్తున్నారు. ఈ తరుణంలో వారి మాటనే అధిష్టానం విశ్వసిస్తుంది. దీంతో ఆ ఉమ్మడి జిల్లాల్లోని గెలుపు బాధ్యతలను అప్పగించడంతో వారు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రచారం సైతం నిర్వహిస్తున్నారు. అయితే ఎలా పార్టీని గెలుపుతీరాలకు తీసుకొని పోవాలన్నది ఇప్పుడు వారికి బిగ్ టాస్క్ అయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేటీఆర్, ఉమ్మడి మెదక్ లో హరీష్ రావు ప్రచారం స్పీడ్ పెంచారు. ఇతర జిల్లాల్లోనూ మాజీ మంత్రులు ప్రచారం చేస్తున్నారు.
Also Read: Seethakka: ములుగులో బీఆర్ఎస్‌కు షాక్.. మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేతలు!
పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో ద్వితీయ నాయకులకు ఉమ్మడి జిల్లా మంత్రులుగా పనిచేసినవారు ఎదగనివ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా జిల్లాలో గానీ, నియోజకవర్గాల్లో గానీ, మండలాల్లోగానీ యాక్టీవ్ గా పనిచేసే వారిని గుర్తించి మరీ వారికి చెక్ పెట్టారు. దీనికి తోడు ఇతర పార్టీల నుంచి వచ్చిన గులాబీలో చేరిన ఎమ్మెల్యేలు సైతం వారి వర్గానికే పెద్దపీట వేశారు. అర్బన్ ప్రాంతాల్లో ఉద్యమం నుంచి, పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నవారికి చెక్ పెట్టారు. వారి వ్యవహారశైలీతో పార్టీలోని సీనియర్ నేతలు సైతం గుర్రుగా ఉన్నారు. కేడర్ సైతం అసంతృప్తితో ఉన్నారు. ఈ తరుణంలో ఉమ్మడి జిల్లా ఇన్ చార్జులుగా పనిచేసిన మంత్రులకే మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను అప్పగించడంతో ఎలా ముందుకు వెళ్తారనేదిఇప్పుడు హాట్ టాపిక్ మారింది. నేతలను ఎలా కలుపుపోతారు? వారిలోని అసంతృప్తిని ఎలా చల్లార్చుతారు? మున్సిపాలిటీల్లో విజయం ఎలా సాధిస్తారనేది పార్టీలోనూ చర్చకు దారితీసింది.
అర్బన్ ప్రాంతాల్లో మాజీ మంత్రులపై తీవ్ర అసంతృప్తి ఉంది. అధికారంలో ఉన్నప్పుడు కొద్దిమందికే పెద్దపీట వేయడం, కనీసం పనిచేసే కేడర్ ,లీడర్లను గుర్తించకపోవడం, కలిసేందుకు వెళ్లిన టైం ఇవ్వకపోవడంతో లోలోన మధనపడుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతుండటంతో కలిసిపోవాలని చెప్పుతుండటంతో కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పనిచేసేవారికి పోటీచేసే అవకాశం ఇవ్వలేదని, పార్టీ బీఫాంలు సైతం నిరాకరించారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పార్టీ పదవులు ఇవ్వలేదని, వార్డులకు, డివిజన్లలోనూ కమిటీలు వేయలేదని, అలాంటప్పుడు ఎలా పనిచేస్తారని పలువురు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. నాడు దగ్గరకు తీయని వారు ఓట్ల సమయంలో సహకరించాలని కోరుతుండటంతో పలువురు పెదవి విరుస్తున్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ మళ్లీ పార్టీ అధిష్టానం ఇవ్వాలంటే మున్సిపాలిటీల్లో గెలిపించుకోవాల్సిందే. లేకుంటే పార్టీ ప్రత్యామ్నాయంగా మరో వ్యక్తిని రాజకీయంగా బలోపేతం చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలో ఇద్దరు వ్యక్తులను తయారు చేస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో ఆయా నియోజకవర్గాల్లో ఇతర నియోజకవర్గాలకు చెందినవారికి ఇన్ చార్జీ బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్పగించింది. అలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటుంది. మరోవైపు ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రుల పనితీరు స్పష్టం కానుంది. వారికి పార్టీలో భవిష్యత్ సైతం ఆధారపడి ఉంది. అయితే మెజార్టీ మున్సిపాలిటీల్లో పార్టీని గెలిపించుకుంటారా? లేకుంటే చేతులెత్తేస్తారా? అనేది ఇప్పుడు పార్టీలో చర్చకు దారితీసింది.