BigTV English

Thief Sleeps in a Car: చోరీకి వచ్చి.. కారులో గుర్రుపెట్టిన దొంగ!

Thief Sleeps in a Car: చోరీకి వచ్చి.. కారులో గుర్రుపెట్టిన దొంగ!

Faridabad Man Trying to Steal Car Ends Up Falling Asleep Inside: ఒక్కోసారి కాలం కూడా కలిసిరాదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేసినా అచ్చిరాదు. అడ్డంగా బుక్కయిపోతాం. ఫరీదాబాద్‌లో ఓ వ్యక్తికి సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. చోరీకి వెళ్లి విచిత్ర పరిస్థితుల్లో పోలీసులకు చిక్కిపోయాడు.


ఓ వాహనాన్ని చోరీ చేద్దామని మంగళవారం రాత్రి అతనికి బుద్దిపుట్టింది. ఓ ఇంటి వద్ద పార్క్ చేసిన మారుతి ఈకో వ్యాన్‌ను చూశాడు. డ్రైవర్ వైపు ఉన్న అద్దాలను పగలగొట్టి లోపలకు దూరాడు. అంతే మత్తు ఆవరించేసింది.

Read More: రైతుల ఛలో ఢిల్లీ మార్చ్.. రెండ్రోజులు వాయిదా


మైకం కమ్మేయడంతో సీటులో అలాగే నిద్రలోకి జారుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున యజమాని వ్యాన్‌ను శుభ్రం చేద్దామని వచ్చేసరికి వ్యాన్ అద్దం పగిలి ఉండటం, కారులో ఎవరో గుర్రుపెట్టి నిద్రపోతుండటం గమనించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వ్యాన్ చోరీకి వచ్చానంటూ విచారణలో అతను అంగీకరించాడు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల మైకం కమ్మేసిందని, అదే అతడిని పట్టిచ్చిందని పోలీసులు చెప్పారు. అతడి వద్ద ఉన్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×