BigTV English

Mannam Venkataramana : అమెరికా నుంచి వస్తుండగా గుండెపోటు.. టిడిపి నేత మృతి

Mannam Venkataramana : అమెరికా నుంచి వస్తుండగా గుండెపోటు.. టిడిపి నేత మృతి

NRI TDP Leader Mannam Venkataramana Died : టిడిపి నేత, ఎన్నారై మన్నం వెంకటరమణ (53) గుండెపోటుతో మరణించారు. అమెరికాలోని న్యూజెర్సీ నుంచి విమానంలో హైదరాబాద్ కు వస్తుండగా.. ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే గ్రీస్ ఏథెన్స్ విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా..వెంకటరమణ 2009 అసెంబ్లీ ఎన్నికలలో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 53 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి.


Read More : చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చిన ఏపీ కాంగ్రెస్‌.. ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత

ఆ తర్వాత అమెరికాలోని వివిధ జాతీయస్థాయి తెలుగు సంఘాల్లో కీలక పాత్ర పోషించారు. దశాబ్దాల క్రితమే ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లోనూ ఆయన యాక్టివ్ గా పనిచేసేవారు. ఇండియా నుంచి అమెరికాకు వెళ్లిన వారికి న్యూజెర్సీలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి.. తన ఉదారతను, గొప్ప మనసును చాటుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.


న్యూజెర్సీ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఆయన గుండెపోటుకు గురవ్వడంతో.. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆరోగ్యం విషమించి మరణించినట్లు వైద్యులు తెలిపారు. వెంకటరమణ మృతితో టిడిపిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పార్టీ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×