BigTV English

Modi Praised Manmohan Singh: ఆయన తీరు నిబద్దతకు నిదర్శనం.. మన్మోహన్ సింగ్ పై మోదీ ప్రశంసలు

PM Modi praised Manmohan Singh: రాజకీయాల్లో అప్పుడప్పుడూ అరుదైన ఘటనలు చూస్తుంటాయి.

Modi Praised Manmohan Singh: ఆయన తీరు నిబద్దతకు నిదర్శనం.. మన్మోహన్ సింగ్ పై మోదీ ప్రశంసలు

PM Modi Praised Manmohan Singh: రాజకీయాల్లో అప్పుడప్పుడూ అరుదైన ఘటనలు చూస్తుంటాయి. ప్రత్యర్ధులపై విమర్శలతో నేతలు కాలం గడిపేస్తున్న రోజుల్లో ఓ బలమైన రాజకీయ నేత మరో ప్రతిభావంతుడైన మాజీ నేతను ప్రశంసలతో ముంచెత్తడం ఇవాళ కనిపించింది. అదీ తన రాజకీయ ప్రత్యర్ధి పార్టీ అని తెలిసి కూడా ఈ ప్రశంసలు చేయడం పరిణిత రాజకీయానికి నిదర్శనంగా నిలిచింది. అలాంటి అరుదైన ఘటనకు రాజ్యసభ వేదికగా నిలిచింది.


రాజ్యసభ సభ్యుల్లో పలువురు వచ్చే నెలలో విడ్కోలు పలకబోతున్నారు. వారిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. దీంతో రిటైర్ అవుతున్న రాజ్యసభ సభ్యులకు బుధవారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. హాజరైన ప్రధాని మోడీ పార్లమెంటరీ రాజకీయాలు ఎలా మార్పు చెందుతున్నాయో చెప్పుకొచ్చారు. అదే సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రశంసలు కురిపించారు.

పార్లమెంట్ సభ్యులకు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ స్పూర్తి అని ప్రధాని ప్రధాని మోడీ ప్రశంసించారు. పాత పార్లమెంట్ భవనంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విశ్వాస పరీక్షలో, ట్రెజరీ బెంచ్ గెలుస్తుందని తెలుసు కానీ డాక్టర్ మన్మోహన్ సింగ్ తన వీల్ చైర్‌పై వచ్చి ఓటు వేశారని మోదీ అన్నారు. ఒక సభ్యుడు అప్రమత్తంగా ఉండేందుకు ఇదొక నిదర్శనమన్నారు.


Read More: Rahul Gandhi: ప్రధాని మోదీ ఓబీసీ కాదు.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..

కోవిడ్ మహమ్మారిని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. అనిశ్చితులు పెద్ద ఎత్తున ఎదురైనప్పుడు, సభ పనితీరుకు ఎలాంటి ఆటంకం కలగకుండా సభ్యులు వ్యవహరించిన నిబద్ధతను మోదీ కొనియాడారు. ఎంపీలు తమ బాధ్యతలను నిర్వర్తించేందుకు చేపట్టిన భారీ నష్టాలను ఆయన గుర్తించారు. కోవిడ్ -19 కు ప్రాణాలు కోల్పోయిన సభ్యులకు మోడీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×