BigTV English

Rahul Gandhi: ప్రధాని మోదీ ఓబీసీ కాదు.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..

Rahul Gandhi: ప్రధాని మోదీ ఓబీసీ కాదు.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..

Rahul Gandhi on Caste Census: ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కులం గురించి ఆయన అబద్ధం చెప్పారని ఆరోపించారు. ప్రధాని మోదీ కుల గణనకు అంగీకరించరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ యాత్ర లో భాగంగా ఒడిశాలో పర్యటిస్తున్నారు.


ప్రధాని మోదీ ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాదని రాహుల్ గాంధీ అన్నారు. ఆయన గుజరాత్‌లోని తెలి కులంలో జన్మించారన్నారు. దీనిని 2000 సంవత్సరంలో జనరల్ విభాగం నుంచి ఓబీసీ కేటగిరీలోకి మార్చారని పేర్కొన్నారు. మోదీ ఓబీసీకి చెందిన కుటుంబంలో జన్మించలేదు కాబట్టే జీవితాంతం కులగణనకు అంగీకరించరని అని రాహుల్ ఆరోపించారు.

Read More: మోదీ ‘ఓబీసీ’ కాదన్న రాహుల్‌.. కేంద్రం క్లారిటీ..


రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో న్యాయ్ యాత్ర గురువారం ఒడిశా నుంచి ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించనుంది.అక్కడ కొద్దినెలల క్రితం అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాభవాన్ని మూటకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తొలిసారి అక్కడకు వెళ్లనున్నారు.

మణిపూర్‌ నుంచి మహారాష్ట్ర వరకు ‘భారత్‌ జోడో న్యాయయాత్ర’.. 15 రాష్ట్రాలు 100 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 67 రోజుల పాటు కొనసాగనుంది. జనవరి 14న మణిపుర్‌లోని ధౌబల్‌ పట్టణంలో మొదలైన ఈ కార్యక్రమం.. దాదాపు 6713 కి.మీ మేర సాగనుంది.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×