BigTV English

Priyanka attack on Modi on Obsence video: చిక్కుల్లో బీజేపీ, ఆ వీడియోల మాటేంటి?

Priyanka attack on Modi on Obsence video: చిక్కుల్లో బీజేపీ, ఆ వీడియోల మాటేంటి?

Priyanka attack on Modi on Obsence video: కర్ణాటక వ్యవహారం కేంద్రంలోని మోదీ సర్కార్‌కు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇంటా బయటా కమలనాథులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు తీవ్రమయ్యాయి. రెండురోజులుగా నలుగుతున్న ఈ వ్యవహారంపై బీజేపీ పెద్దలు సెలైంట్‌గా ఉండడంతో హాట్ టాపిక్‌గా మారింది.


ఇంతకీ వీడియోల వ్యవహారం ఏంటి? ఇంకా లోతుల్లోకి వెళ్తే.. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, జేడీఎస్ నేత హాసన్ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అసభ్యకర వీడియోలు కర్ణాటక రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్నాయి. ఎన్నికల వేళ ఈ వ్యవహారంపై సొంత పార్టీ నుంచి జేడీఎస్‌కు ఇబ్బందులు తప్పలేదు. ఈ పరిణామాల మధ్య ప్రజ్వల్ దేశం విడిచి విదేశాలకు వెళ్లడంతో మరిన్ని అనుమానాలు రెట్టింపయ్యాయి.

దీనిపై సిద్దరామయ్య సర్కార్ విచారణ చేస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ రియాక్ట్ అయ్యారు. కొద్దిరోజుల కిందట ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్‌తో కలిసి ఫోటోలు దిగారని, వేదికపై ప్రశంసించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ నేత విదేశాలకు పారిపోయారని సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఈ ఘోరాల గురించి తెలిసిన తర్వాత ఎందరో మహిళలు జీవితాలు నాశనం అయ్యాయన్నారు. ఇప్పుడు కూడా ప్రధాని మోదీ మౌనంగా ఉంటారా అంటూ ప్రశ్నించారు.


ALSO READ: పీఎం కిసాన్ 17వ విడత.. రైతుల ఖాతాలకు రూ. 2000..! ఎప్పుడో తెలుసా..?

ఈ యవ్వారంపై మాజీ సీఎం కుమారస్వామి మాట్లాడారు. ప్రజ్వల విషయంలో ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందన్నారు. తప్పు చేస్తే శిక్ష తప్పదన్నారు. అయితే ప్రజ్వల్ విదేశాలకు వెళ్లడంలో తన ప్రమేయం లేదన్నారు. మరోవైపు దీనిపై కర్ణాటక బీజేపీ నేత దేవరాజె గౌడ స్పందించారు. ఈ వ్యవహారంపై ఐదు నెలల కిందట రాష్ట్ర పార్టీ యూనిట్‌కు తాను లేఖ రాశానని తెలిపారు. ప్రజ్వల్ పలువురు మహిళలను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవడంతో మన పార్టీపై విమర్శలు వస్తున్నాయని చెప్పారు. ప్రజ్వల్‌కు సంబంధించిన అసభ్యకరమైన వీడియోలు హాసన్ జిల్లాలో చక్కర్లు కొడుతున్నాయి.  లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా హాసన్ నియోజకవర్గం నుంచి బీజేపీ-జేడీఎస్ అభ్యర్థిగా ప్రజ్వల్ రేవణ్ణ మరోసారి బరిలో ఉన్నారు. ఏప్రిల్ 26న ఆ సీటుకు పోలింగ్ జరిగింది.

 

Tags

Related News

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Big Stories

×