E-Paper
Advertisement

సహారా ఎడారి లేకపోతే అమెజాన్ అడవి ఉండేది కాదా? రెండింటి మధ్య అసలు లింకేంటి?

సహారా ఎడారి లేకపోతే అమెజాన్ అడవి ఉండేది కాదా? రెండింటి మధ్య అసలు లింకేంటి?
Advertisement

Sahara Dust Feeds Amazon Forest: సహారా ఎడారి.. అమెజాన్ అడవుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండూ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ప్రాంతాలు. సహారా ఎడారిలో నీరు ఉండదు. మొక్కలు పెద్దగా పెరగని ప్రాంతం. మరోవైపు అమెజాన్   ప్రపంచంలోనే అతిపెద్ద వర్షారణ్యం. ఈ రెండింటికీ ఎలాంటి సంబంధం ఉండదని చాలామంది అనుకుంటారు. కానీ, శాస్త్రవేత్తలు చెప్పే విషయాలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సహారా ఎడారి, అమెజాన్ అడవి మనుగడలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిస్తే నిజంగా షాకవ్వాల్సిందే.

అమెజాన్ ను కాపాడుతున్న సహారా

శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం.. అమెజాన్ అడవి ఉందంటే, దానికి కారణం సహారా ఎడారి. ప్రతి సంవత్సరం సహారా నుంచి భారీ మొత్తంలో ధూళి గాలుల ద్వారా అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవులకు చేరుతుంది. ఈ ధూళిలో మొక్కల ఎదుగుదలకు అవసరమైన విలువైన ఖనిజాలు ఉంటాయి. ముఖ్యంగా భాస్వరం అమెజాన్ అడవికి ఎంతో అవసరం. అమెజాన్ ప్రాంతంలో ఏడాది పొడవునా భారీ వర్షాలు కురుస్తుంటాయి. ఈ కారణంగా అక్కడి నేలలో ఉండే పోషకాలు, ఖనిజాలు క్రమంగా కొట్టుకుపోతుంటాయి. నేలలో సహజంగా ఉండాల్సిన పోషకాల స్థాయి తగ్గిపోతుంది. అలాంటి సమయంలో సహారా ఎడారి నుంచి వచ్చే ధూళి ఆ లోటును భర్తీ చేస్తుంది. ధూళితో పాటు వచ్చే భాస్వరం నేలలో కలవడంతో చెట్లు, మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు అవసరమైన పోషకాలు అందుతాయి. అందుకే సహారా నుంచి వచ్చే ధూళిని అమెజాన్ అడవికి సహజ ఎరువుగా కూడా అభివర్ణిస్తారు. ప్రకృతిలో ఒక ప్రాంతం మరో ప్రాంతానికి ఎంత ముఖ్యమో ఈ రెండింటి మధ్య సంబంధం తెలియజేస్తోంది.

సహారా ఎడారి అడవిగా మారితే?

Advertisement

శాస్త్రవేత్తలు మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా చెబుతున్నారు. ఒకవేళ భవిష్యత్తులో సహారా ఎడారి పూర్తిగా పచ్చని అడవిగా మారితే, అక్కడ దుమ్ము తుఫానులు చాలా వరకు తగ్గిపోతాయి. దాంతో అమెజాన్‌కు చేరే ధూళి పరిమాణం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఫలితంగా అక్కడి నేలకు అవసరమైన భాస్వరం సరఫరా తగ్గిపోవచ్చు. అలా ఎక్కువ కాలం కొనసాగితే అమెజాన్ అడవిలోని చెట్లకు సరిపడా పోషకాలు అందక, ఆ అడవి క్రమంగా బలహీనపడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇది వెంటనే జరిగే మార్పు కాదంటున్నారు. చాలా సంవత్సరాల పాటు జరిగే సహజ ప్రక్రియల ఫలితంగా మాత్రమే ఇలాంటి ప్రభావం కనిపించే అవకాశం ఉంటుందంటున్నారు.

ప్రపంచంలో ఒక ఖండంలో ఉన్న ఎడారి, మరో ఖండంలో ఉన్న దట్టమైన అడవి మనుగడకు తోడ్పడటం నిజంగా ప్రకృతి అద్భుతమే. భూమిపై ఉన్న ప్రతి పర్యావరణ వ్యవస్థ ఒకదానితో ఒకటి ఏదో ఒక రూపంలో అనుసంధానమై ఉంటుందనే విషయాన్ని సహారా, అమెజాన్ గుర్తు చేస్తున్నాయి. ప్రకృతిలోని ఈ సమతుల్యతే భూమిపై జీవ వైవిధ్యాన్ని కాపాడుతోంది.

Advertisement

Read Also: ఒకప్పుడు పాక్ లో.. ఇప్పుడు ఇండియాలో.. ఈ అందమైన గ్రామం గురించి మీకు తెలుసా?

Related News

పాత బంగ్లాలో అర్ధరాత్రి విడిది.. దెయ్యం లేదని నిరూపిస్తే.. రూ.52 వేలు మీవే!

Gulf Job Scam: విజిట్ వీసా vs వర్క్ వీసా.. ఈ ఒక్క తప్పు చేస్తే గల్ఫ్‌లో జీవితం నాశనమే!

ఒకప్పుడు పాక్ లో.. ఇప్పుడు ఇండియాలో.. ఈ అందమైన గ్రామం గురించి మీకు తెలుసా?

హైడ్రోజన్ రైలుపై రాళ్లు విసిరారా? వైరల్ వీడియోపై రైల్వే క్లారిటీ!

రాత్రిపూట వెలిగే మొక్కలు వచ్చేశాయి.. ‘అవతార్‘ సినిమాలో చూసింది ఇప్పుడు నిజమైంది!

ఈ నదుల్లో నీళ్లే కాదు, బంగారం ప్రవహిస్తుంది.. నిజంగా అద్భుతం!

48 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన భార్య.. పచ్చబొట్టు చూసి గుండెలకు హత్తుకున్న భర్త!

Big Stories

Advertisement
×