E-Paper
Advertisement

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?
Advertisement

Farmers March: దేశ రాజధాని ఢిల్లీ వైపు అన్నదాతల చూపు పడింది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ఉత్తరాది రాష్ట్రాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు కథం తొక్కారు. కిసాన్ ఘాట్‌లో జరిగే మహా పంచాయత్ లో పాల్గొంటున్నారు. దీనికి సుమారు 550 రైతు సంఘాలు ఒకేతాటి మీదకు వచ్చాయి. ఫలితంగా ఢిల్లీ-హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు బార్డర్ వద్ద హైటెన్షన్ నెలకొంది.

మోదీ ప్రభుత్వానికి కష్టాలు రెట్టింపు అయ్యాయి. హస్తినలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రదర్శనలు, ఆందోళనలు చేస్తోంది. ఛలో పార్లమెంట్ ర్యాలీలు కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం వేలాదిమంది రైతులు ఢిల్లీ బాటపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఓ భారీ ర్యాలీ చేపట్టారు. అందులో పాల్గొనడానికి వేలాదిగా రైతులు తరలివచ్చారు.. వస్తున్నారు.

Advertisement

అందుకోసం దేశంలోని 550 రైతు సంఘాలు ఒకే తాటి మీదకు వచ్చాయి. రైతులు ఢిల్లీలోకి రాకుండా పంజాబ్, హర్యానా ప్రవేశించే శంభు సరిహద్దులను మూసి వేశారు. దీంతో హైటెన్షన్ నెలకొంది. భారత్-అమెరికా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నిరసన గళాన్ని విప్పారు రైతులు. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ మార్చ్ చేపట్టారు.

ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద మహా పంచాయత్‌కు  దేశ్ బచావో మోర్చా పిలుపు ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు వందలాది రైతు సంఘాలు హస్తిన బాట పట్టాయి. వారికి సామాజిక సంస్థలు తోడయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు సరిహద్దులోని శంభు బోర్డర్ వద్దకు చేరుకున్నారు.  పరిస్థితి గమనించిన ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాలను మూసి వేసింది.

Advertisement

1. 21 జూలై 2026న ఏం జరగనుంది? సర్వాన్ సింగ్ పంధేర్ నాయకత్వంలో దేశ్ బచావో మోర్చా బ్యానర్ కింద రైతులు ఏకమయ్యారు.  భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం- FTA నిరసిస్తూ మంగళవారం ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద ఒక రోజు కిసాన్ మహాపంచాయత్ నిర్వహించనున్నారు.

2. ఎవరు నాయకత్వం వహిస్తున్నారు?  పంధేర్ ‘కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ’కి అధిపతిగా ఉన్నారు. దేశ్ బచావో మోర్చాను ఆయన సమన్వయం చేస్తున్నారు. ప్యాకేజీ మద్దతు ధర-MSPపై చట్టబద్ధమైన గ్యారెంటీ కోరుతూ 2024లో శంభూ-ఖనౌరీ సరిహద్దుల్లో జరిగిన ఉద్యమానికి ఈయన నేతృత్వం వహించారు.

3. ముఖ్యమైన అసంతృప్తి ఏంటి? రైతుల అభిప్రాయాలు, భాగస్వామ్యులను సంప్రదించకుండా ప్రభుత్వం వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోందన్నది రైతుల ప్రధాన ఆరోపణ. ఒప్పందం వివరాలు అమెరికా పత్రికా ప్రకటనల ద్వారా తమకు తెలిసిందని, దీనిని ఒక రహస్య వాణిజ్య ఒప్పందంగా విమర్శిస్తున్నారు.

4. రెండు దేశాల మధ్య సుంకాల  వివాదం తర్వాత భారత వ్యవసాయ మార్కెట్లను అమెరికాకు తెరవాలనే ఒత్తిడి మేరకు 2025 COMPACT చొరవ కింద  భారత్-అమెరికా FTA చర్చలు జరిగాయి.. ఇంకా కంటిన్యూ అవుతున్నాయి.

5. ఆర్థిక భయాలు దిగుమతి సుంకాల తగ్గింపు వల్ల అమెరికా నుంచి చౌకగా, సబ్సిడీలతో కూడిన పాలు-పాడి ఉత్పత్తులు, ధాన్యాలు, మాంసం, సోయా బీన్స్, డ్రై ఫ్రూట్స్ భారత మార్కెట్‌ను ముంచెత్తుతాయని రైతుల భయం. ఇది చిన్న రైతులు, కార్మికులు, వ్యాపారులతో సహా భారతీయ శ్రామిక శక్తిలో దాదాపు సగం మందికి జీవనాధారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది.

6. డెయిరీ పరిశ్రమ అత్యంత సున్నితమైన అంశం? అమెరికా పాడి పరిశ్రమ అక్కడి ప్రభుత్వం అందించే భారీ సబ్సిడీలతో నడుస్తోంది. అక్కడ పశువుల దాణా పద్ధతులు భారతీయ మతపరమైన భావోద్వేగాలకు విరుద్ధంగా ఉంటాయని చెబుతున్నారు. భారతదేశం ఇప్పటివరకు సంతకం చేసిన ప్రతి FTA నుండి పాడి రంగాన్ని మినహాయించింది. దాన్ని అంగీకరిస్తే భవిష్యత్తుకు ప్రమాదకరమైన ఆనవాయితీగా మారుతుందని వారి ఆవేదన.

7. రైతులు మంగళవారం ఢిల్లీకి వస్తున్న విషయం తెలుసుకున్న హర్యానా పోలీసులు సరిహద్దులను బారికేడ్లు, యంత్రాలతో మూసి వేశారు. BKU నాయకుడు గుర్నామ్ సింగ్ చదూనిని అదుపులోకి తీసుకున్నారు. 2024లో శంభూ-ఖనౌరీ సరిహద్దుల్లో వాడిన అణచివేత విధానాన్ని మళ్లీ అమలు చేశారు. ఫలితంగా ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ హెచ్చరికలు జారీ అయ్యాయి.

8. రైతుల నిరసనలో హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల రైతులు పాల్గొన్నారు.  ఇది కేవలం పంజాబ్‌కి పరిమితం కాకుండా దేశవ్యాప్త రైతు ఉద్యమంగా మారుతోందని సూచిస్తోంది.

9. డిమాండ్లు, తదుపరి ప్రణాళిక ఒప్పందం నిబంధనలపై పూర్తి పారదర్శకత ఉండాలని కోరుతున్నారు రైతులు. వ్యవసాయం- పాడి రంగాన్ని ఏ రకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం- FTA నుండి పూర్తిగా మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు. భారత్-అమెరికా మధ్య కుదిరిన ఈ డీల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరకపోతే నిరసనల తదుపరి దశను ప్రారంభిస్తామని నిర్వాహకులు హెచ్చరించారు.

10. రాజకీయం- ఇది ఎందుకు కీలకం? కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఈ వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ నిరసన 2020–21 నాటి సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమాన్ని గుర్తు చేస్తోంది. ఆనాటి ఉద్యమం వల్ల నాటి చట్టాలు రద్దయ్యాయి. అమెరికాతో వాణిజ్య సంబంధాలు- సుదీర్ఘ పోరాటాలకు సిద్ధ పడే రైతుల ఆందోళన మధ్య ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఘర్షణలు జరగకపోయినా ఉద్రిక్తత తీవ్రంగా ఉంది.

ALSO READ: పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

 

 

Related News

రణరంగంగా దేశ రాజధాని.. కదంతొక్కిన విద్యార్థులు, రైతులు.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు!

మమ్మల్ని లాగొద్దు.. తక్షణమే విచారించలేం.. బొద్దింకలకు దిల్లీ హైకోర్టు ఝలక్!

ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

Big Stories

Advertisement
×