Congress Protest: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది. పార్లమెంట్ వేదికగా ఒకపక్క, ప్రధాని నివాసం వద్ద మరోపక్క జరుగుతున్న నిరసనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీజేపీ మద్దతుదారులు, కాంగ్రెస్ అగ్రనేతలు చేపట్టిన ఆందోళనలతో ఎటు చూసినా హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ బైఠాయింపు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఎంపీలంతా కలిసి లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లతో పాటు పలువురు సీనియర్ నాయకులు అక్కడ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గట్టిగా నినాదాలు చేశారు.
Also Read: పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన
పార్లమెంట్ ముట్టడికి యత్నం.. రాహుల్ పరామర్శ
మరోవైపు CJP మద్దతుదారులు పార్లమెంట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే రాహుల్ గాంధీ ఆసుపత్రికి వెళ్లి, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు ప్రధాని నివాసం, పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నేతల అరెస్టులు జరిగే అవకాశం ఉండటంతో అక్కడ వాతావరణం మరింత వేడెక్కింది.
రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి చర్చ..
ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన ధర్నా కొనసాగుతోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అక్కడికి చేరుకున్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని కోరారు. కేంద్ర మంత్రి రాకతో కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున నిరసన తెలిపారు.
హైటెన్షన్.. మోదీ ఇంటి వద్ద కాంగ్రెస్ నిరసన
ఢిల్లీలో హైటెన్షన్ కొనసాగుతోంది. ఒకవైపు CJP సపోర్టర్స్ పార్లమెంట్ ముట్టడికి యత్నిస్తుండగా కాంగ్రెస్ పార్టీ లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసం ముట్టడి చేపట్టింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా INC ఎంపీలంతా మోదీ ఇంటి వద్ద… pic.twitter.com/CVFatKsrsP
— BIG TV Breaking News (@bigtvtelugu) July 21, 2026