E-Paper
Advertisement

Putin Stay ITC Maurya: రష్యా అధ్యక్షుడు పుతిన్ బస అక్కడే.. సకల సౌకర్యాలు, ఒక్కరాత్రికి ఎంతో తెలుసా?

Putin Stay ITC Maurya: రష్యా అధ్యక్షుడు పుతిన్ బస అక్కడే.. సకల సౌకర్యాలు,  ఒక్కరాత్రికి ఎంతో తెలుసా?
Advertisement

Putin Stay ITC Maurya: రెండు రోజుల పర్యటన కోసం గురువారం ఢిల్లీ వచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. దాదాపు 30 గంటలపాటు ఆయన హస్తినలో గడపనున్నారు. ఐటీసీ మౌర్య హోటల్‌లో స్టే చేశారు. ఆ హోటల్ ఉంటే ప్రాంతాన్ని హై సెక్యూరిటీ జోన్‌గా మార్చారు. ప్రపంచంలో చాలామంది ప్రముఖులు ఇష్టపడే హోటల్ ఇది. ప్రస్తుతం ఆ హోటల్ అంతా నిఘా నీడలో ఉంది. ఇంతకీ ఆ హోటల్ స్పెషల్ ఏంటి? ఒక్కరాత్రి ఎంత? అనే డీటేల్స్ లోకి వెళ్లొద్దాం.

ప్రపంచ నాయకుల బస ఐటీసీ మౌర్య

Advertisement

ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లోవున్న ఐటీసీ మౌర్య హోటల్ ప్రపంచ నాయకుల బసకు కేరాఫ్. కేవలం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ గురువారం రాత్రి అక్కడే బస చేశారు. ఆయనకు మాత్రమేకాదు 2020లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌కు వచ్చినప్పుడు అక్కడే ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, యుకె మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, దలైలామా వంటి ప్రముఖులు అక్కడే బస చేశారు. ఏప్రిల్‌లో భారత పర్యటన సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కుటుంబసభ్యులు ఈ హోటల్‌లో బస చేశారు కూడా.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్.. భద్రతా సంస్థలు, మీడియా దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. పుతిన్ రాకకు ముందు అంటే 24 గంటలకు ముందే రష్యా భద్రతా సిబ్బంది ఆ హోటల్‌కు చేరుకుని కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే చీమ చిటుక్కుమన్నా ఆదేశ సెక్యూరిటీ క్షణాల వ్యవధిలో తెలిసిపోతుంది. ఐటీసీ మౌర్య హోటల్‌ను అధికారులు తమ నియంత్రణలోకి తీసుకోవడమేకాదు హోటల్‌లోని అన్ని గదులను బుక్ చేశారు. కారిడార్లను బారికేడ్లతో మూసివేసి ప్రవేశ మార్గాల వద్ద నిఘా ఏర్పాటు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే హోటల్‌ని 30 గంటలపాటు దుర్భేద్యమైన కోటగా మార్చేశాయి భద్రతా బలగాలు.

Advertisement

సకల సౌకర్యాలు, ఒక్కరాత్రికి ఎంతో తెలుసా?

నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ హోటల్‌లో 411 గదులు, 26 సూట్‌లు ఉన్నాయి. ఢిల్లీలోని అత్యంత సురక్షితమైన లగ్జరీ హోటల్‌గా ఖ్యాతిని సంపాదించుకుంది. కాంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ క్లబ్ గదుల నుండి విశాలమైన లగ్జరీ సూట్‌ల వరకు వసతి ఉంటుంది. వీటి గోప్యత, ప్రముఖుల సేవల కోసం రూపొందించబడింది. పుతిన్ ITC మౌర్యలో అత్యంత విలాసవంతమైన చారిత్రక ప్రాధాన్యమున్న చాణక్య సూట్‌‌లో బస చేశారు పుతిన్. ఆతిథ్యమిచ్చిన ఈ సూట్ కేవలం 4,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మీడియా నివేదికల ప్రకారం ఒక్క రాత్రికి రూ.8 నుండి 10 లక్షల వరకు ఛార్జ్ చేస్తారట.

ALSO READ: ఇండిగో ఎయిర్ లైన్స్ కార్యకలాపాలపై మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష

ఈ సూట్ ఇంటీరియర్ డెకరేషన్ ఆధునికత, రాజసం ఉట్టిపడేలా ఉండనుంది. గోడలకు పట్టు వస్త్రంతో చేసిన ప్యానెల్స్ ఉండనున్నాయి. ప్రముఖ చిత్రకారుడు మెహతా కళాఖండాలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ప్రముఖుల భోజనానికి విల్లెరాయ్ అండ్ బోష్ బ్రాండ్ క్రాకరీ, క్రిస్టల్ డి ప్యారిస్ గ్లాస్‌వేర్‌ను వినియోగించారు మాస్టర్ బెడ్‌రూమ్‌తోపాటు వాక్-ఇన్ క్లోజెట్, ప్రైవేట్ స్టీమ్ రూమ్ ఉండనున్నాయి. అలాగే ఆవిరి స్నానాల గది, పూర్తిస్థాయి జిమ్, 12 మంది కూర్చొనేలా డైనింగ్ రూమ్ డిజైన్ చేశారు. ఇందులో బస చేసేవారికి చెక్ ఇన్, చెక్-అవుట్ ప్రత్యేక సదుపాయాలు ఉండనున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆనాటి మౌర్యుల కాలం నాటి వైభవాన్ని ప్రతిబింబిస్తుంది.

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×