E-Paper
Advertisement

OTT Movie: డబ్బు కోసం పందెం… నడక ఆపితే నరకానికి టికెట్టు… సస్పెన్స్ తో పిచ్చెక్కించే సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie: డబ్బు కోసం పందెం… నడక ఆపితే నరకానికి టికెట్టు… సస్పెన్స్ తో పిచ్చెక్కించే సర్వైవల్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ తరువాత అలాంటి డెత్ గేమ్స్ కి బాగానే డిమాండ్ ఏర్పడింది. అలాంటి కంటెంట్ లో డిఫరెంట్ స్టోరీలు వస్తున్నాయి. రీసెంట్ గా ఒక మూవీ అలాంటి కంటెంట్ తో థియేటర్లలో విజయవంతంగా నడిచింది. ఇది ఒక డిస్టోపియన్ వరల్డ్‌లో జరుగుతుంది. 50 టీనేజ్ పిల్లలు డెడ్లీ వాకింగ్ కాన్‌టెస్ట్‌లో పాల్గొంటారు. వీళ్ళు గంటకు 4 మైళ్లవేగంతో నడవాల్సి ఉంటుంది. రూల్స్ బ్రేక్ చేస్తే గన్ తో షూట్ అవుతారు. ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ‘స్క్విడ్ గేమ్’ ని తలపిస్తుంది. థ్రిల్లర్ ఆడియన్స్ కి బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘ది లాంగ్ వాక్’ (The Long Walk) 2025లో విడుదలైన ఒక అమెరికన్ డిస్టోపియన్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా. ఇది స్టెఫెన్ కింగ్ 1979లో రాసిన నవల ఆధారంగా రూపొందింది. ఫ్రాన్సిస్ లారెన్స్ (ది హంగర్ గేమ్స్ సిరీస్ ఫేమ్) దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో కూపర్ హాఫ్‌మన్, డేవిడ్ జాన్సన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఇది థియేట్రికల్ గా 2025 సెప్టెంబర్ 12న రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 48 నిమిషాల నిడివితో ఐయండిబిలో 6.8/10 రేటింగ్ పొందింది. ఇంగ్లీష్ ఒరిజినల్ తో పాటు హిందీ, తెలుగు, తమిళ డబ్బింగ్ వెర్షన్స్ తో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

డిస్టోపియన్ అమెరికాలో ప్రతి ఏటా “ది లాంగ్ వాక్” అనే భయంకర కాన్‌టెస్ట్ జరుగుతుంది. 50 మంది టీనేజ్ పిల్లలు (16-18 ఏళ్లు) ఒక రోడ్ మీద గంటకు 4 మైళ్ల వేగంతో నాన్‌స్టాప్ గా నడవాల్సి ఉంటుంది. మూడు వార్నింగ్స్ తర్వాత స్లో అయితే సోల్జర్స్ గన్‌తో కాల్చి చంపేస్తారు. చివరగా ఎవరైతే మిగులుతారో వాళ్ళే విన్నర్స్మి. అతనికి భారీ క్యాష్ ప్రైజ్ ఉంటుంది. ఈ గేమ్ టెలివైజన్‌లో లైవ్ లో కూడా టెలికాస్ట్ అవుతుంది. ప్రజలు బెట్టింగ్ కూడా వేసుకుంటారు. ఇందులో ప్రధాన పాత్రలో నటించే గారేటీ అనే సాధారణ టీనేజ్ బాలుడు తన తల్లి కోసం ఈ వాక్‌లో పాల్గొంటాడు. వాక్ మొదలైన కొద్ది గంటలకే మొదటి డెత్ జరుగుతుంది. ఒక బాలుడు స్లో అవ్వడంతో గన్‌తో కాల్చబడతాడు. ప్రజలు కూడా ఆనందిస్తారు. రోజులు గడుస్తాయి కంటెస్టెంట్స్ నిద్ర లేకుండా, ఆకలి లేకుండా, ఎక్సాస్టెడ్‌గా నడుస్తారు. ఈ గేమ్ లో ఒకరు మరొకరిని పుష్ చేసి చంపేస్తారు, కొందరు స్వయంగా సూసైడ్ చేసుకుంటారు.

Read Also : పాడు చేసినోడిని పాడెక్కించే అమ్మాయి…. ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామా

Advertisement

గారేటీ, మ్యాక్‌వ్రీస్ అనే ఈ ఇద్దరూ లాస్ట్ కు మిగులుతారు. మ్యాక్‌వ్రీస్ స్లో అయి వార్నింగ్స్ తీసుకుంటాడు. గారేటీ అతన్ని ఎంకరేజ్ చేస్తాడు కానీ మ్యాక్‌వ్రీస్ చివరి వార్నింగ్ తర్వాత షూట్ అవుతాడు. గారేటీ ఏడుస్తూ అతని బాడీ పక్కన కూర్చుంటాడు. ఇప్పుడు గారేటీ ఒక్కడే మిగులుతాడు. అతడే ఇప్పుడు విన్నర్. కాన్‌టెస్ట్ నడిపే మేజర్ అతన్ని అభినందిస్తాడు. గారేటీ గన్ తీసుకుని మేజర్‌ని కాల్చి చంపేస్తాడు. క్రౌడ్ షాక్ అయి సైలెంట్ అవుతుంది. గారేటీ మైక్‌లో ది వాక్ ఇక ఎప్పటికీ జరగదు అని అరుస్తాడు. దూరంగా సైరన్ సౌండ్ వినిపిస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా చూసి తెలుసుకోండి.

 

 

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×