E-Paper
Advertisement

Google Try It On: ఆన్‌లైన్‌లో బట్టలు కొనడం మరింత సులువు.. గూగుల్ ట్రయల్ రూంలో మీ ఫొటో చూపిస్తే సరి

Google Try It On: ఆన్‌లైన్‌లో బట్టలు కొనడం మరింత సులువు.. గూగుల్ ట్రయల్ రూంలో మీ ఫొటో చూపిస్తే సరి
Advertisement

Google Try It On| బట్టలు కొనేసమయంలో “ఇవి నాకు సరిపోతాయా? రంగు, డిజైన్ సెట్ అవుతాయా?” అని టెన్షన్ పడతారు కదా? ఈ సమస్యకు పరిష్కారంగా ఇప్పుడు గూగుల్ ఇండియా ఒక అద్భుతమైన టూల్ తీసుకొచ్చింది. దాని పేరు ట్రై ఇట్ ఆన్ (Try it on). ఇందులో మీ ఫుల్ సైజు ఫొటో ఇస్తే.. మీ శరీరంపై బట్టలు ఎలా కనిపిస్తాయో చూపిస్తుంది.

ఈ టూల్ ఎలా పని చేస్తుంది?

ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్. మీ శరీర ఆకారం, ఎత్తు, నడుము సైజు.. ఈ ఫీచర్లన్నీ గమనిస్తుంది. ఆ బట్టలు మీరు వేసుకుంటే ఎలా మడత పడుతుందో, ఎలా ఫిట్ అవుతుందో రియల్‌గా సిమ్యులేషన్ చేసి చూపిస్తుంది. మీరు షాప్‌లో బట్టలు వేసుకున్నట్టే అనిపిస్తుంది!

ఈ టూల్ ఉపయోగించడం చాలా సింపుల్.. ఇలా చేయండి

Advertisement

గూగుల్‌లో మీకు ఇష్టమైన బట్టలు సెర్చ్ చేయండి
ఆ ప్రొడక్ట్ ఫోటో పక్కన “Try it on” అనే బటన్ కనిపిస్తుంది. దాన్ని నొక్కండి
మీ ఫుల్ బాడీ కనిపించే ఒక్క ఫోటో అప్‌లోడ్ చేయండి
ఆ ఫోటోలో మీరు స్ట్రెయిట్‌గా నిలబడి, ముందుకు చూడాలి
మంచి లైటింగ్ ఉండాలి, బట్టల ఫిట్టింగ్ సరిగ్గా ఉండాలి
అంతే! కొద్ది సెకన్లలో మీపై మీరు కోరుకున్న బట్టలు మీరు వేసుకుంటే ఎలా ఉంటుందో గూగుల్ చూపిస్తుంది.

బెస్ట్ రిజల్ట్ కోసం ఈ టిప్స్ ఫాలో చేయండి

చాలా లూజ్ లేదా టైట్ బట్టలు వేసుకొని ఫోటో తీయొద్దు
గోడ ముందు నిలబడి, రెండు చేతులు పక్కన పెట్టి ఫోటో తీయండి
తల నుంచి కాళ్ల వరకు పూర్తి శరీరం కనిపించాలి
మంచి లైట్ ఉండే ప్రదేశంలో ఫోటో తీయండి
కొంచెం వెయిట్ చేయండి – ప్రాసెస్ అయ్యాక సూపర్ రియలిస్టిక్ ఫోటో వస్తుంది!

మీకు నచ్చిన లుక్స్ సేవ్ చేసుకోండి

Advertisement

నచ్చిన బట్టల ఫోటోలను మీరు సేవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేసి వారి అభిప్రాయం అడగొచ్చు. ఇకపై బట్టలు మీకు సరిపోతాయా? లేదా? అని గందరగోళం ఉండదు!

ట్రై ఇట్ ఆన్ టూల్ వల్ల ఇవే లాభాలు?

బట్ట వచ్చాక “సైజు సరిపోలేదు” అని రిటర్న్ చేయాల్సిన పని తగ్గుతుంది
కొత్త స్టైల్స్, కలర్స్ ధైర్యంగా ట్రై చేయొచ్చు
షాపింగ్ టెన్షన్ తగ్గి ఫన్ అవుతుంది
సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి

ఇప్పుడే గూగుల్ ఓపెన్ చేసి మీ ఫేవరేట్ డ్రెస్ సెర్చ్ చేయండి – “Try it on” బటన్ కనిపిస్తే వెంటనే ట్రై చేయండి! ఇది మీ సొంత వర్చువల్ షాపింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తుంది.

Also Read: సరదా కోసం బ్లూటూత్ ల్యాండ్‌లైన్‌ ఫోన్ తయారు చేసిన యువతి.. 3 రోజుల్లోనే రూ.1 కోటి సంపాదన

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×