E-Paper
Advertisement

Rs 19 Crore Drugs seized in Mumbai: ముంబై ఎయిర్‌పోర్టులో రూ. 19 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత.. మహిళ అరెస్ట్..!

Rs 19 Crore Drugs seized in Mumbai: ముంబై ఎయిర్‌పోర్టులో రూ. 19 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత.. మహిళ అరెస్ట్..!
Advertisement
Mumbai Drugs Case
Mumbai Drugs Case

Rs 19 Crore Drugs seized in Mumbai Airport: ముంబై ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 1979 గ్రాముల కొకైన్ ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సియెర్రా లియోన్ కు చెందిన ఓ మహిళా ఎయిర్ పోర్టులో కొకైన్ తీసుకొస్తూ దొరికిపోయింది. ఈ కొకైన్ విలువ రూ. 19 కోట్ల 79 లక్షలు ఉంటుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు.

కెన్యాలోని నైరోబీ నుంచి సదరు మహిళ ముంబై వచ్చారు. ఆమె వద్ద డ్రగ్స్ ఉన్నాయని అధికారులకు ముందే సమాచారం అందింది. ఈ క్రమంలోనే విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించారు. ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఆ మహిళ వద్ద ఉన్న షూ, షాంపూ, మాయిశ్చరైజర్ బాటిల్స్ అడుగును వైట్ పౌడర్ ఉందని అధికారులు గుర్తించారు.

Advertisement

Also Read: మోదీపై ఘాటు వ్యాఖ్యలు.. తమిళనాడు మంత్రిపై కేసు..

ఎయిర్ పోర్టులో అధికారుల తనిఖీల్లో గుర్తించిన పౌడర్ ను పరీక్షించారు. అది కొకైన్ అని తేలింది. దీంతో నైరోబీ నుంచి వచ్చిన  మహిళను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. డ్రగ్స్ అక్రమ రవాణాపై విచారణ చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×