BigTV English

Telangana Weather Report: వచ్చే మూడు రోజులు జాగ్రత్త.. ఇంటినుంచి బయటకు రాకండి..!

Telangana Weather Report: వచ్చే మూడు రోజులు జాగ్రత్త.. ఇంటినుంచి బయటకు రాకండి..!

Telangana State TemparatatureTelangana State Temperature:మార్చి నెల మధ్యలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రెండుమూడు రోజుల క్రితం వరకు రాష్ట్రంలో అక్కడడక్కడ తేలిపాటి వర్షాలు కురవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. అంతలోనే తెలంగాణ వ్యాప్తంగా ఎండలు భారీగ మండుతాయని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 2-3 రోజులు అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.


మార్చి నెలలోనే ఎండలు తీవ్ర స్థాయిలో మండిపోతున్నాయి. ప్రజలు మధ్యాహ్న సమయంలో ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. అంతలా భానుడు మండిపడుతున్నాడు. అయితే తెలంగాణ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు మరో హెచ్చరిక జారీ చేసింది. రానున్న 2-3 రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని తెలిపింది. నిన్న మొన్నటితో పోల్చితే అధిక వేడి ఉంటుందని వెల్లడించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD సూచించింది.

ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలు, రాత్రి పూట 26 డిగ్రీలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడిచిన నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని తెలిపింది. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా వేసింది.


Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. బీఆర్ఎస్ నేతలకు నోటీసులు..!

ఈ మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని తెలిపింది. దీంతో అవసరం ఉంటనే ప్రజలు బయటకు రావాలని సూచించింది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు బయటకు వచ్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

Related News

Global Study Expo 2025: గ్లోబల్ స్టడీ ఎక్స్‌పో- 2025, తక్కువ ఖర్చుతో విదేశీ విద్య, స్టూడెంట్స్ మాటల్లో

Hyderabad Accident: ఎల్‌బీనగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం, బైక్‌ని ఢీ కొట్టిన కారు, నుజ్జుయిన కారు

Innovation Hub: ఈ రెండు జిల్లాలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటు: శ్రీధర్ బాబు

Vemulawada Temple: రాజన్న దర్శనాల్లో తాత్కాలిక మార్పులు.. రేపటి నుంచి భీమేశ్వరాలయంలో దర్శనాలు

Janagam District: రియల్లీ గ్రేట్.. ఆటోలోనే పురుడు పోసిన ఆశా వర్కర్లు.. జనగాం జిల్లాలో ఘటన

Konda Surekha vs Ponguleti: ఢిల్లీకి చేరిన పంచాయితీ.. పొంగులేటిపై సోనియాకు కొండా కంప్లైంట్

BC Reservations: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. BC రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం

Karimnagar BJP: కరీంనగర్ జిల్లా బీజేపీలో.. బయటపడ్డ విభేదాలు..

Big Stories

×