BigTV English

Case on Minister Anitha R Radhakrishnan: మోదీపై ఘాటు వ్యాఖ్యలు.. తమిళనాడు మంత్రిపై కేసు!

Case on Minister Anitha R Radhakrishnan: మోదీపై ఘాటు వ్యాఖ్యలు.. తమిళనాడు మంత్రిపై కేసు!
DMK Minister Anitha R Radhakrishnan
DMK Minister Anitha R Radhakrishnan

Filed a Case against DMK Minister Anitha R Radhakrishnan: తమిళనాడులో బలం పెంచుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ ముందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎన్నికల ప్రచారంపై బీజేపీ అధిష్టానం దృష్టిపెట్టింది. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఆమె ఎంపీగా పోటీ చేయబోతున్నారు. సినీ ప్రముఖలకు కాషాయ పార్టీ గాలం వేసింది. రాధికా శరత్ కుమార్ కు ఎంపీ టిక్కెట్ ఇచ్చింది.


తమిళనాడులో బీజేపీ దూకుడు నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అధికార పార్టీ డీఎంకే ఎదురుదాడికి దిగుతోంది.  ఈ క్రమంలో రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి అనితా ఆర్. రాధాకృష్ణన్  ప్రధాని మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మార్చి 22న తండుపాతులో డీఎంకే కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. దివంగత సీఎం కామరాజ్ ను మోదీ పొగడటంపై మండిపడ్డారు. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలాన్ని ప్రయోగించారు.

Also Read: పాతగూటికి చేరిన గాలి.. ఇప్పుటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్!


తమిళనాడు మంత్రి వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని పేర్కొంటూ బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి  ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనితా ఆర్. రాధాకృష్ణన్ పై కేసు నమోదైంది. పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

తమిళనాడులో 39 లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. ఏప్రిల్ 19న రాష్ట్రంలో ఎన్నికల జరగనున్నాయి.

Tags

Related News

Aadhar – Pan Cards: ఆధార్, పాన్, ఓటర్ ఐడీ.. దానికి పనికి రావు

Minta Devi Bihar: పార్లమెంట్ లో రచ్చరేగిన..124 ఏళ్ల ఓటరు ఎక్కడ?.. ఆమె మాట ఇదే!

Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

Stray Dogs: వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీంకోర్టు.. రంగంలోకి అధికారులు, మండిపడ్డ పెటా

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Big Stories

×