Sonam Wangchuk: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయనప్పటికీ దీక్ష విరమించడంపై ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ క్లారిటీ ఇచ్చారు. నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నిరోధించడమే తన తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఇందుకు కేంద్రం నుంచి లిఖిత పూర్వక హామీ రావడంతో 26 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను తాను విరమించినట్లు యూట్యూబ్ వీడియోలో చెప్పుకొచ్చారు.
మరికొన్ని అంశాలపై కూడా కేంద్రం తనకు లిఖితపూర్వక హామీని ఇచ్చిందని వాంగ్ చుక్ తెలిపారు. విద్యార్థులపై కేసులు నమోదు చేయకపోవడంతో పాటు పరీక్షల్లో సంస్కరణలు, పేపర్ లీక్స్ పై పార్లమెంటులో సమగ్ర చర్చ, నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తనతో చెప్పిందన్నారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే తన నిరాహాక దీక్షను విరమించినట్లు యూట్యూబ్ వీడియోలో వాంగ్ చుక్ క్లారిటీ ఇచ్చారు.
AFTER 26 DAYS OF HUNGER DO I NEED TO PROVE MY SINCERITY !!!
Do please watch and help spread the word. Find the full 22 minutes video on my YouTube Channel: Sonam Wangchuk pic.twitter.com/6CO3tjZsSD— Sonam Wangchuk (@Wangchuk66) July 24, 2026
మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం గురించి కూడా వాంగ్ చుక్ ఈ వీడియోలో ప్రస్తావించారు. కేంద్రానికి ఈ రాజీనామా అంశం అతి చిన్న విషయమని ఆయన పేర్కొన్నారు. కానీ దానికి నిరాకరించడం వల్ల వారు అపారమైన నష్టాన్ని చవిచూస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా కేంద్రం ప్రతిష్ట దెబ్బతింటోందని.. ప్రజలు ద్వేషంతో, కోపంతో ఊగిపోతున్నారని వాంగ్ చుక్ అన్నారు. అయితే చర్చల సమయంలో ప్రధాన్ రాజీనామా అంశాన్ని తాను కేంద్ర మంత్రులతో మాట్లాడినట్లు కూడా వాంగ్ చుక్ తెలిపారు. వారు ఇంకా సమయం కావాలని, దానిపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని బదులిచినట్లు చెప్పారు.
Also Read: ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. యాక్టివ్ కేసుల సంఖ్య ఎంతో తెలుసా?
అయితే కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థుల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడిని కేంద్రం ఎక్కువ రోజులు తట్టుకొని నిలబడలేదని వాంగ్ చుక్ అభిప్రాయపడ్డారు. రేపో మాపో ప్రధాన్ రాజీనామా చేయకతప్పదని తనకు తెలుసన్నారు. ఎందుకంటే రాజీనామా చేయకపోవడం వల్ల నష్టం కేంద్రానికే ఎక్కువ కాబట్టి ఆ దిశగా అడుగులు పడతాయన్న నమ్మకం తనకు ఉందన్నారు. అందుకే ఆ విషయంలో మరింత ఒత్తిడి కేంద్రంపై తీసుకోరాలేదని వాంగ్ చుక్ స్పష్టం చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థులను ఇబ్బంది పెట్టమని, కేసులు నమోదు చేయమని కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రావడంతో చివరికి తన దీక్షను విరమించినట్లు వాంగ్ చుక్ యూట్యూబ్ వీడియోలో వివరించారు.